ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరిట ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి లుచ్చా రాజకీయాలకు తెరతీశాడని మంత్రి కొడాలి నాని ద్వజమెత్తాడు. అసలు చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో తిరిగే అర్హతే లేదని అన్నారు.
అమరావతి: నీచుడైన చంద్రబాబుకు చెప్పులతో స్వాగతం పలికిన రాజధాని రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి కొడాలి తెలిపారు. రైతుల భూములు లాక్కుని నమ్మకద్రోహం చేసిన అతడికి తగిన విధంగా బుద్దిచెప్పారని అన్నారు.
టిడిపి అధికారంలో వున్నగత ఐదేళ్లు కేవలం గ్రాఫిక్స్ కి ముద్దులు పెట్టిన బాబు... ఇప్పుడు రాజధాని భూమికి ముద్దు పెట్టాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగినందుకు సంతోషంగా వుందన్నారు.
undefined
ప్రజలు కేవలం 23 సీట్లు ఇచ్చినా ఆయనకు ఇంకా సిగ్గురాలేదని... ఈ రోజు ప్రజలు చెప్పులతో కొట్టినా బుద్ధి రాలేదన్నారు. చంద్రబాబు సిగ్గూ, శరం లేని లుచ్చా అంటూ ఘాటైన విమర్శలు చేశారు.
read more ఏపి నాశనమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయాలు..: దేవినేని అవినాష్
ఇకనైనా చంద్రబాబు తన డ్రామాలు ఆపాలని... అవన్నీ ఔట్ డేటెడ్ అయిపోయాయని గుర్తించాలని సూచించారు. ఇక పప్పు వల్ల ఏమీ కాదని ఏదైనా చేయాలని అనుకుంటూ ఇంకా సుద్ద పప్పు అవుతాడని విమర్శించారు.
అమరావతి స్మశానం కాదని కానీ చంద్రబాబు మాత్రం పెద్ద శవమేనని అన్నారు. ఆయనతో ఉన్నవాళ్లు దున్నపోతులని విమర్శించారు. తమ ప్రభుత్వానికి అమరావతితో పాటు రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు ముఖ్యమేనని...అన్నింటినీ సీఎం జగన్ ఒకే విధంగా చూస్తున్నారని తెలిపారు.
దేశంలోనే చంద్రబాబు అంత లుచ్చా ఎవడూ లేడంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబేనని...రెండెకరాల నుండి లక్షల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సొల్లు కాకుండా రాజధానిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదో చంద్రబాబు చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు.
ఇక మరో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ...చంద్రబాబు పాతకాలం చచ్చు రాజకీయాలు మానుకోవాలన్నారు. ఐదేళ్లు గ్రాఫిక్స్ చూపించినందుకు ప్రజలు చుక్కలు చూపించారన్నారు.
read more అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ నేను కట్టుబడే వున్నా: బొత్స
లక్షా ఐదు వేల కోట్లతో రాజధాని నిర్మాణం అని ప్రచారం చేసి ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారని తెలిపారు. తెచ్చిన అప్పుకు వడ్డీ ఎవరు కడతారో చెప్పాలని... ప్రజలపై భారం వేసి అప్పు తెచ్చిన సొమ్ముతో దుబారా చేసి కమీషన్ల రూపంలో నొక్కేశారని ఆరోపించారు. ఇతచేసీ మొండి గోడలతో సగం సగం బిల్డింగ్ లు కట్టారన్నారు.
చంద్రబాబు చేసిన పాపాలకు ఈ రోజు భగవంతుడు సరైన బుద్ధి చెప్పాడని...ఆనాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయిస్తే ఇప్పుడు ప్రజలు ఆయనపై చెప్పులు వేశారుని విమర్శించారు. నమ్మించి మోసం చేసాడు కనుకే కడుపు మండి రైతులు చెప్పులేశారని అన్నారు.
తండ్రి కొడుకులు రాజకీయ పబ్బం కోసం రోజుకో డ్రామా క్రియేట్ చేస్తున్నారని...అమరావతిపై అంత ప్రేమ ఉంటే ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. అమరావతిపై నమ్మకం లేక హైదరాబాద్ లో 200 కోట్లతో ఇల్లు నిర్మించుకున్నారని నాని ఆరోపించారు.