అమరావతి నిర్మాణంపై ఓవైపు రగడ కొనసాగుతుండగానే సీఎం జగన్ రాజధానిపై నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిమధ్య అమరావతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై కీలక చర్చలు సాగినట్లు తెలుస్తోంది.
అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, రాజధాని అమరావతి అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ సభ్యులు సీఎం వైయస్. జగన్‌తో సమావేశమయ్యారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు సీఎంకు వివరించారు. తాము అధ్యయనం చేసిన అంశాలకు సంబంధించి నివేదికను త్వరలోనే సమర్పిస్తామని సీఎంకు తెలిపారు.
undefined
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్.రావు, సెక్రటరీ విజయ్ మోహన్, డాక్టర్ అంజలి మోహన్, కె.టి.రవీంద్రన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారావు ఉన్నారు.
read more చంద్రబాబు ఓ నీచుడు...అందుకే చెప్పులతో స్వాగతం..: కొడాలి నాని
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగానే రాజధాని నిర్మాణం ఉంటుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నగరం తనంతట తాను పెరగాలి కానీ.. అవసరానికి మించిన నిర్మాణాలు అనవసరమనేది ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది. దీనిపైనే తాము ముఖ్యంగా కసరత్తు చేస్తున్నట్లు... అత్యంత తొందరగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశాలపై నివేదిక ఇస్తామని వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో ఇవాళ పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పర్యటనపై మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోనే నివాసం వుంటున్నా ఇవాళ కొత్తగా పర్యటన చేపట్టడం విడ్డూరంగా వుందని మంత్రి సెటైర్లు విసిరారు.
కేవలం ఏదో విధంగా మీడియాలో కనపడాలనే చీఫ్ పబ్లిసిటీ కోసమే ఆయన ఇలా రాజధాని పర్యటన అంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
మూడు రోజులు కడప జిల్లా వెళ్ళిన చంద్రబాబు పిచ్చి కుక్కలా మొరిగి వచ్చాడన్నారు. ఇక ఇవాళ, రేపు పనేమీ లేదు కాబట్టి అమరావతి పర్యటన అంటూ ఓ పనికిమాలిన పర్యటన చేపట్టాడని నాని విమర్శించారు.
ఈ రెండురోజుల తర్వాత శనివారం, ఆదివారం హైదరాబాదు వెళ్ళి హెరిటేజ్ వ్యాపారాలు చూసుకుంటాడని...ఇలా దోచుకున్న డబ్బులు సింగపూర్ కు పంపించి ఎలా దాచుకోవాలో చూసుకుంటాడని నాని ఆరోపించారు. కాబట్టి ఈ రోజంతా చంద్రబాబు అమరావతి లో తిరిగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, రాష్ట్ర ప్రభుత్వంపై పిచ్చి కుక్కలాగా మొరుగడమే పనిగా పెట్టుకుంటాడు.
read more ఆ అమరావతి నిర్మాణం నిజంగానే ఆగిపోయింది...: డిప్యూటీ సీఎం సంచలనం
చంద్రబాబు గతంలో అమరావతి తానే కట్టానని అన్నాడని గుర్తుచేశారు. కానీ ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి కట్టడంలేదని అంటున్నాడని... ఇంతకూ అమరావతిని కట్టినట్లా...కట్టనట్లా ఆయనే ఓ క్లారిటీకి రావాలని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లు చంద్రబాబు పోలవరం, అమరావతిలను కేవలం దోచుకోవడానికి ఏటిఎం లుగా వాడటం లేదా అని ప్రశ్నించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని స్మశానం అన్నాడని తెగ విమర్శలు చేస్తున్నారని గుర్తుచేశారు. నిజానికి సగం కట్డిన కట్టడాలతో అది స్మశానం లాగా ఉంది వాటిని నువ్వు ఏం చూస్తావని మాత్రమే బొత్స అన్నారని వివరణ ఇచ్చారు.