ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని భారీ కేక్ ను కట్ చేశారు.
తాడేపల్లి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ కేక్ ను సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కట్ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.... ప్రియతమ నేత జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలో ఈరోజు పరిణతి చెందిన రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది జగనేనని... ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోందన్నారు..దానికి ప్రధాన కారణం ప్రజాసంక్షేమమేనని అన్నారు.
undefined
ఆనాడు దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి బలమైన పునాదులు వేస్తే ఆ పునాదులు మరింత పటిష్టంగా ప్రజలలోకి తీసుకువెళ్లిన నేత జగన్ అని కొనియాడారు. తండ్రి బాటలో నడవడం వల్లే ఆయనను అతికొద్ది కాలంలోనే ఇంతటి ప్రాచుర్యం లభించిందన్నారు.
read more హైకోర్టుతో కర్నూలుకు ఒరిగేదేం లేదు... బిజెపి విధానమిదే: విష్ణువర్ధన్ రెడ్డి
ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టకముందు ఆయన జరిపిన పాదయాత్ర నభూతో నభవిష్యత్తు అనే విధంగా సాగిందన్నారు. గతంలో కూడా ఆ కుటుంబం నుంచే పాదయాత్ర జరిపారని గుర్తుచేశారు. పాదయాత్ర జరిపి ప్రజా సమస్యలు తెలిసుకుని... ప్రజలతో మమేకమైన వ్యక్తులు వైఎస్ కంటే ముందు ఎవరూ లేరన్నారు.
తనను నమ్ముకున్న పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మొదట రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. షర్మిల కూడా పాదయాత్ర చేపట్టారు. అయితే సుధీర్ఘమైన ప్రజాసంకల్ప యాత్రను 14 నెలలపాటు సాగించి, ప్రజలలో తిరిగిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా వున్నారంటే ఆయన జగనేనని అని ప్రశంసించారు.
రష్యాలో జరిగిన లాంగ్ మార్చ్ చాలా కొద్ది దూరం మాత్రమే చేశారని... ఈ మధ్య కిలోమీటర్ నడిచి కూడా లాంగ్ మార్చ్ అని పేరుపెట్టుకున్నారని పవన్ ను ఉద్దేశించి ఉమారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే జగన్ పాదయాత్ర మాత్రం మూడువేల 648 కిలోమీటర్ దూరం... దాదాపు 2 కోట్ల మంది ప్రజానీకంతో కలిసి సాగిందన్నారు.
రాష్ట్రంలో ఎన్ని వృత్తులవారు ఉన్నారో వారందరూ ఈ పాదయాత్రలో జగన్ ను కలిశారన్నారు. ఆ సమయంలో వారిని అడిమరీ సమస్యలు తెలుసుకున్న జగన్ అధికారంలోకి వస్తూనే వాటి పరిష్కారానికి నడుం బిగించారన్నారు. అప్పుడు చేసిన వాగ్దానాలను అనుసరించే మేనిఫెస్టో తయారుచేశారని...అదే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా జగన్ పలుమార్లు పేర్కొన్నారని అన్నారు.
read more ఎన్టీఆర్‌ను తలపిస్తున్న జగన్ పాలన...: మంత్రి అనిల్
'' గతంలో వాగ్దానాలు ఓట్ల కోసం చేశారు. పరిపాలన అనేది స్వార్ధం కోసం చేసుంటారు. కాని ఈయన అలా కాదు. అందుకే నేను చెబుతున్నాను జగన్ ఓ అరుదైన రాజకీయవేత్త. పరిణతి చెందిన రాజకీయవేత్త'' అంటూ ప్రశంసలు కురిపించారు.
''2014 ఎన్నికల్లో పాల్గొన్నప్పటి నుంచే ప్రజల సమస్యలపై ఆయన తీసుకున్న శ్రధ్ద మరెవరూ తీసుకోరు. సమాజానికి జగన్ అప్పీలు చేశారు. తమ పార్టీ మేనిఫెస్టో టేబుల్ పై పెట్టుకుని వాటిలో ఏది మరచిపోయినా నాకు చెప్పమని కోరారు.. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీయండి అని చెప్పిన వ్యక్తి జగన్ మాత్రమే. గతంలో ఏ రాజకీయవేత్త అలా చెప్పలేదు. ఆరునెలలు తిరగకముందే ఆ మేనిఫెస్టోలో ఏమైనా మిగిలాయా అంటే అలా లేదు'' అని ఉమారెడ్డి పుట్టినరోజున జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.