ఏపికి మూడు రాజధానులు... కేంద్ర ప్రభుత్వ జోక్యం వుండదు...: బిజెపి ఎంపీ జివిఎల్

By Arun Kumar PFirst Published Jan 21, 2020, 2:40 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చేయనుందో ఎంపీ జీవిఎల్ నర్సింహరావు వెల్లడించారు. 

న్యూడిల్లీ: రాజధాని కోసం ఏర్పాటుచేసిన శివరామకృష్ణ కమిటీ వద్దనిచెప్పినా వినకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధానిని అమరావతిలో పెట్టిందని బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్సింహారావు ఆరోపించారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని... ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాదే చెప్పినట్లు జివిఎల్ వెల్లడించారు. 

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బిజెపి నాయకులు మంగళవారం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్  ను కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై చోటుచేసుకుంటున్న పరిణామాలపై వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఫెడరల్ వ్యవస్థ లో కేంద్రం ఇలాంటి అంశాల్లో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని అన్నారని జీవిఎల్ తెలిపారు. అయితే బిజెపి తరపున రాజకీయంగా ఈ అంశాన్ని వుతిరేకించవచ్చని కేంద్రమంత్రి సూచించారని తెలిపారు.  

read more   పవన్ కల్యాణ్ హౌస్ అరెస్ట్... ఎమ్మెల్యే రాపాక వ్యవహారంపై స్పందించిన జనసేనాని
  
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఎందుకు విచారణ జరపటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై నిస్పక్షపాత విచారణ జరిపి బాధ్యులని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ప్రస్తుతం అమరావతి పవర్స్ అన్ని లాక్కుని ఉత్తుత్తి రాజధానిగా మిగిల్చారని జీవిఎల్ విమర్శించారు. 

 రాష్ట్ర రాజధాని అంశం కేంద్రం పరిధిలోది కాదని గతంలోనే జివిఎల్ అన్నారు. కేంద్రం కల్పించుకుంటే వ్యవస్థకు లోబడి చేయాలన్నారు. ఒకవేళ రాష్ట్రం సహాయం కొరితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని అన్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా తాను బిజెపి అధికార ప్రతినిధిగా పార్టీ తరపున అసలు నిజాలు చెబుతున్నానని జివిఎల్ అన్నారు. సుజనా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని... వాటితో పార్టీకి ఏమాత్రం సంబంధం లేవని తెలిపారు.

read more  మేకులున్న లాఠీలతో కొట్టారు.. పోలీసుల ముసుగులో వాళ్లపనే: పవన్ వ్యాఖ్యలు

రాజధాని ప్రాంత రైతులకు న్యాయం ఖచ్చితంగా జరగాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ పట్ల అమరావతి రైతులు అభిమానం చూపిస్తున్నందుకు జివిఎల్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సలహా కోరితే మాత్రం ఖచ్చితంగా‌ అందిస్తుందని అన్నారు. 

 

 


 

click me!