రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటు చేయాలన్న జగన్ నిర్ణయంపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.
గుంటూరు: కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్రంలోని విపక్షాలన్నింటికి ఒకే తాటిపై తెచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికగా అమరావతిని రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ పొరాటం చేస్తున్నాయని అన్నారు.
అతి తక్కువ కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్న సీఎంగా కూడా జగన్ చరిత్ర సృష్టించారని సెటైర్లు విసిరారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇంత అభద్రతా భావంలో ఏ ముఖ్యమంత్రి ఉండడని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత దుర్మార్గ పాలన ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.
undefined
read more జగన్ కు కేంద్ర ప్రభుత్వ అండదండలున్నాయా...?: కన్నా ఏమన్నారంటే
బీజేపీ నాయకులు టీడీపీకి గేట్లు ముసేసామనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. బీజేపీతో పొత్తు కోసం ఎవరు ఎదురుచూడటం లేదన్నారు. జనసేన-బీజేపీ ల పొత్తు వారి వ్యక్తిగత విషయమని... ఈ పొత్తుకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల పిచ్చి ప్రేలాపణలు మానుకొని తక్షణమే అమరావతి ని రాజధాని గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.