విశాఖ నుండి అమరావతికే... జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Arun Kumar P   | Asianet News
Published : Dec 24, 2019, 09:03 PM ISTUpdated : Dec 24, 2019, 09:10 PM IST
విశాఖ నుండి అమరావతికే... జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

సారాంశం

ఈ నెల 27న  జరగాల్సిన కేబినెట్ భేటీ వేదిక రోజుకో దగ్గరకు మారుతోంది. ఇప్పటివరకు విశాఖలో జరుగుతుందని భావించిన ఈ సమావేశం మళ్లీ అమరావతికే మారినట్లు తెలుస్తోంది.  

అమరావతి:  ఈ నెల 27 ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్  సమావేశం జరగాల్సి వుంది. అయితే ఈ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న దానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుత రాజధాని అమరావతిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో మంత్రివర్గ  సమావేశం జరగనుందన్న ప్రచారం జరిగింది. అయితే రెండు రోజుల్లోనే ఈ సమావేశం వుండటంతో ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో అమరావతిలోనే నిర్వహించాలని అధికారలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈనెల 27న విశాఖలో కాకుండా వెలగపూడిలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కేబినెట్ భేటీకి అమరావతి ప్రాంతంలోనే ఏర్పాట్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆందోళనల నేపథ్యంతో పటిష్ట బందోబస్తు  ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులకు సీఎస్ నుండి ఆదేశాలు అందాయట. 

read more  జగన్ సీఎం అయ్యాడని ఆనందించా... కానీ: మాజీ మంత్రి పితాని

ఈ కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీకి కేబినెట్ ఆమోదం తెలపే అవకాశాలున్నాయి. అలాగే మూడు రాజధానులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఏపి రాజధాని అంశమే ప్రధాన ఎజెండాగా ఈ మంత్రివర్గ సమావేశం  ఏర్పాటు చేశారు. ఇక నిరసన బాట పట్టిన అమరావతి రైతులకు వరాలు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఈ కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది. 

 ఏపీకి రాజధానుల విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఇటీవలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను ఇచ్చారు. ఈ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించాలని కమిటీ సూచించింది.

 కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖ, అమరావతిలలో హైకోర్టు బెంచ్‌లు కూడ ఏర్పాటు చేయాలని కమిటీ  సూచించింది. ఈ తరుణంలో విశాఖలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.  

read more  మూడు రాజధానుల ఏర్పాటు చేయవచ్చు... ఎప్పుడంటే: బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు

విశాఖలో లులు గ్రూపుకు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేసుకొంది. ఐదెకరాల స్థలంలో బీచ్ రోడ్డులో ఈ ఫంక్షన్ హాల్ ఉంది. గత ప్రభుత్వం ఈ ఫంక్షన్ హాల్ ను లులు గ్రూప్‌కు కేటాయించింది. ఈ అనుమతులను జగన్ సర్కార్ రద్దు చేసింది. 

 ఐదెకరాల స్థలంలో ఉన్న ఈ ఫంక్షన్ హాల్‌లో మంత్రిర్గ సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం సాగింది పార్కింగ్ సమస్య కూడ లేకుండా ఉండేందుకు ఈ స్థలాన్ని ఎంపిక చేశారని అన్నారు. ఫంక్షన్‌హాల్‌కు అనుకొని ఉన్న 11 ఏపీఐఐసీ భూమి కూడ ఉంది. అయితే తాజాగా సమావేశ వేదిక మళ్లీ అమరావతిలోనే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా