హోంమంత్రి కూతురి వివాహ విందులో సీఎం జగన్

Published : Oct 10, 2019, 09:07 PM ISTUpdated : Oct 10, 2019, 09:31 PM IST
హోంమంత్రి కూతురి వివాహ విందులో సీఎం జగన్

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి సుచరిత కూతురు వివాహవిందు అట్టహాసంగా జరిగింది. ఈ విందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. 

అమరావతి: మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ లో జరుగుతున్నఏపీ హోంమంత్రి సుచరిత కుమార్తె విహహ విందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హజరయ్యారు. ఆయన వదూవరులిద్దరిని ఆశీర్వదించారు. అలాగే సుచరిత దంపతులతో కలిసి నూతన వధూవరులతో ఫోటోలు దిగారు. 

ఈ విందులో సీఎంతో పాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. అలాగే గుంటూరు, ప్రశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన చాలామంది రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు కూడా ఈ విందుకు హాజయ్యారు. అలాగే వైసిపి కార్యకర్తలు భారీసంఖ్యలో హాజయ్యారు. 

నిన్న(బుధవారం) పశ్చిమ గోదావరి జిల్లాలో సుచరిత కుమార్తె రిషిక ,దీపక్ కుమార్ వివాహ వేడుక వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అక్కడ జరగడంతో వివాహ విందును మంగళగిరి లో ఏర్పాటుచేశారు. 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా