విద్యా రంగంలో పటిష్టమైన పునాదులను అరవై యేళ్ల క్రితం అబుల్ కలాం వేశారు.: అంజద్ భాషా

By Prashanth MFirst Published Nov 11, 2019, 2:41 PM IST
Highlights

మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా ఇటీవల గుంటూరులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలో మంత్రి అంజద్ భాషా   జాతీయ విద్యా సంవత్సరం నిర్వహిస్తున్నామని  పలు విషయాలపై మాట్లాడారు..  

మంత్రి అంజద్ భాషా మాట్లాడుతూ.. "దేశ స్వాతంత్య్ర ఉజ్వలమైన భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన వారికి జోహార్లు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా సంవత్సరం నిర్వహిస్తున్నాం అటువంటి వారి జయంతి రోజున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి స్మరించుకోవడం మన ధర్మం విద్యా రంగంలో పటిష్టమైన పునాదులను అరవై యేళ్ల క్రితం అబుల్ కలాం వేశారు.

 సంపూర్ణ అక్షరాస్యత సాధించిన నాడే అభివృద్ధి సాధ్యం నేటి పోటీ ప్రపంచములో విద్యా రంగాన్ని మరింత పటిష్ఠం చేయాలి మౌలానా కృషి వల్లే మన దేశ విద్యా విధానం పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపాయి పేదరికం నిర్మూలన కోసం విద్య ను అందరికీ అందించాలని మౌలానా ఆనాడే సూచించారు అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు ఎంత చెప్పినా తక్కువే .ఆయన భావాలు, ఆలోచనలు ప్రపంచ మేధావులను అబ్బురపరిచాయి.  

ఆయన పేరుతో విద్యా పురస్కార అవార్డులను అందిస్తున్నాం వైసిపి ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తుంది మైనారిటీ విద్యార్థులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తుంది ఇమామ్ , మౌజీలకు పది వేలు, ఐదు వేలకు జగన్ పెంచారు దేశంలోనే తొలిసారిగా హజ్ యాత్రికలకు పూర్తి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది జెరూసలెం యాత్రికులకు కూడా ఆదాయాన్ని బట్టి అరవై, ముప్పై వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది చర్చి ఫాదర్లకు నెలకు ఐదు‌వేలు ఇస్తున్నాం ఎపి అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేలా జగన్ కృషి చేస్తున్నారు" అని వివరించారు.

click me!