రాజధాని కోసం రెండెకరాలు... గుండెపోటుకు గురైన అమరావతి రైతు

By Arun Kumar P  |  First Published Jan 31, 2020, 6:21 PM IST

రాజధానిని అమరావతి నుండి తరలిస్తారన్న బాధతో మరో రైతు ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటన తుళ్లూరులో చోటుచేసుకుంది. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమరావతిని నుండి రాజధానిని తరలిస్తారన్న మనోవేధనతో ఇప్పటికే చాలామంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో మరో రైతు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి  చెందిన నెలకుదుటి  శ్రీనివాసరావు రాజధాకి కోసం  భూమిని కోల్పోయాయి. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా అతడి రెండెకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. ప్రాణంగా భావించే భూమి పోయినా తమ పిల్లలకు మంచి భవిష్యత్ వుంటుందని భావించిన అతడికి వైసిపి ప్రభుత్వ నిర్ణయం మింగుడుపడలేదు.

Latest Videos

undefined

దీంతో తోటి రైతులతో కలిసి శ్రీనివాసరావు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఇంటివద్ద వుండగా ఒక్కసారిగా అతడు  గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు హుటా హుటిన అతన్ని గుంటూరులోని రమేష్ హాస్పిటల్ కు తరలించారు. 

read more  420 సెక్షన్ కింద విచారణ... ఏమిటీ జగన్మాయ...: చంద్రబాబు ఆగ్రహం

వెంటను వైద్యాన్ని ప్రారంభించిన డాక్టర్లు ఆపరేషన్ చేసి రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఐసీయులో ఉన్న శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.  

ఇప్పటివరకు శ్రీనివాసరావు హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కిన దాఖలాలు లేవని... రాజధాని నిర్ణయం తర్వాత అతడు తీవ్ర మనోవేధనకు గురై ఇలా గుండెపోటుకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

click me!