జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం... సాంబశివారెడ్డికి కీలక పదవి

By Arun Kumar P  |  First Published Nov 7, 2019, 8:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యావిదానంలో సమూల మార్పులను జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కీలకమైన  పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమీషన్ లో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేపట్టేందుకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దిశగానే ఇకపై విద్యాశాఖ నిర్ణయాలుంటాయిన ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఏపి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమీషన్ కు సిఇఒగా ఆలూరు సాంబశివారెడ్డి నియమించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా బాధ్యతలను కూడా చేపట్టారు. కమీషన్ చైర్ పర్సన్ జస్టిస్ రెడ్డి కాంతారావు సమక్షంలో ఆయన విధుల్లోకి చేరారు. అలాగే వైస్ చైర్ పర్సన్ విజయ శారదా రెడ్డి కూడా బాధ్యతలు తీసుకున్నారు. 

Latest Videos

undefined

read more  అనంత వెంకట రామిరెడ్డికి కీలక బాధ్యతలు...

ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విద్యా చరిత్రలో మొదటి సారిగా ఇలాంటి కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా సాంబశివారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా శక్తివంచన లేకుండా తామంతా పని చేస్తామని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు, మేధావులు విద్యారంగంలో మార్పుల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న విషయాన్ని తాము గుర్తుపెట్టుకుంటాం అని సాంబశివారెడ్డి తెలిపారు.

read more అది ఉన్నతవర్గాల హక్కు మాత్రమే కాదు... అందుకే ఈ నిర్ణయం..: విద్యా మంత్రి

ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నేటి విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించి వారిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలను ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఆంగ్ల బోధనకు ఉపాధ్యాయులను సంసిద్దులను చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో పాటు చేయడంతో పాటు మాతృ భాష తెలుగుకు కూడా సముచిత స్థానం ఇస్తామని ఆయన తెలిపారు.

సమర్ధవంతమైన సమాచార నైపుణ్యాలు విద్యార్థులకు అందజేయడం అవసరంగా మారిందన్నారు. ఆంగ్లం సార్వత్రిక భాష కనుక ఇందులో నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించడంతో పాటుగా అన్ని విషయాలను ఆంగ్ల మాధ్యమంలో పరిచయం చేయడం చారిత్రక అవసరంగా మారిందన్నారు.

 ప్రస్తుతం వివిధ బోధనా మాధ్యమాలు రాష్ట్రంలో అమలు అవుతున్న నేపధ్యంలో బోదనామాధ్యమాల వారీగా విద్యార్థుల నైపుణ్యాలను సమానంగా పెంపొందించడం సవాలుగా మారిందన్నారు. అంతేకాక కొన్ని బోధనా మాధ్యమాల పట్ల వివక్ష కూడా మొదలై విద్యార్థుల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా మారిందని...వారిని సామాజిక వ్యతిరేక వర్గాలుగా తయారుచేసి ప్రమాదం అంచున కూడా ఉన్నామన్నారు. 

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అవసరాన్ని మంత్రి వివరించారు.ఈ సంవత్సరం అక్టోబర్ నెలాఖరున ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల నమోదును పరిశీలిస్తే మొత్తం 70,90,217
మంది విద్యార్ధులు నమోదులో 44,21,529 (62.36%) మంది విద్యార్ధులో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇతర వర్గాల వారు 82.62% కాగా వెనుకబడిన వర్గాల వారు 62.50% షెడ్యూల్డ్ కులాలవారు 49.61% మరియు షెడ్యుూల్డ్ తరగతుల వారు 33.23% మంది ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు.

  

click me!