హోంమంత్రి పేరుతో బెదిరింపులు... అకౌంటెంట్ ఆత్మహత్య (సెల్ఫీ వీడియో)

By Arun Kumar P  |  First Published Aug 20, 2020, 7:47 PM IST

 వ్యాపార భాగస్వాముల చేతుల్లో మోసపోయి తన ఆవేదనను ఓ సెల్పీ వీడియో ద్వారా బయటపెట్టి రావిపాటి బసవయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. 


గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వ్యాపార భాగస్వాముల చేతుల్లో మోసపోయి తన ఆవేదనను ఓ సెల్పీ వీడియో ద్వారా బయటపెట్టి రావిపాటి బసవయ్య
బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బసవయ్య అనే వ్యక్తి అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తూనే స్నేహితులు పొన్నం శ్రీనువాసరావు, రాపర్ల వెంకటేశ్వర్లుతో కలిసి వ్యాపారం చేశాడు. అయితే స్నేహితులిద్దరూ తనను మోసం చేసి రోడ్డుపైకి లాగారని... మానసికంగా వేధించారని ఆరోపిస్తూ బసవయ్య సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Latest Videos

వీడియో

"

తనను పట్టాబిపురం స్టేషన్ కు పిలిపించి వేధించారని బసవయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. హోంమంత్రి పేరుతో తన కుటుంబం అంతు చూస్తామని హెచ్చరించారని పేర్కొన్నాడు. వారిని ఏం చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. తనను వేదించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బసవయ్య  వేడుకున్నాడు. 
 

click me!