మంత్రి కన్నబాబు అసంతృప్తి... ఆ శాఖాధికారులకు కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published Feb 18, 2020, 1:20 PM IST
Highlights

విజయవాడలోని ఆప్కాబ్ భవనంలో  సహకార శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

అమరావతి: సహకార శాఖ పనితీరుపై రాష్ట్ర సహకార, వ్యవసాయ, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కురశాల కన్నబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పరిశీలనలో ఈ శాఖ గత పదేళ్ళలో గొప్ప ఫలితాలేమీ సాధించలేదని... ఇకనైనా పనితీరు మార్చుకుంటే మంచిదని సంబంధిన శాఖ అధికారులకు మంత్రి హెచ్చరించారు. 

ఈ రోజు(మంగళవారం) విజయవాడలోని ఆప్కాబ్ భవనంలో  సహకార శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. సహకార శాఖ ను పూర్తిగా ఆధునీకరించి కంప్యూటరీకరణ  దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సహకార శాఖ రుణాల మంజూరు, నిబంధనల ప్రకారం రికవరీ, ఎటువంటి అవకతవకలకు అవకాశము లేకుండా నిరంతర ఆడిటింగ్ విధానాన్ని బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. 

read more  ఆ పాపం ప్రజలదే... అందుకు వారే బాధితులు...: వర్ల రామయ్య వ్యాఖ్యలు

ఆర్బిఐ, నాబార్డ్ నిబంధనలు అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.  సహకార శాఖలో సీఈఓ ల పాత్ర చాలా కీలకమైందని... చైర్మన్లకు సరైన సమయంలో నిబంధనల ప్రకారం సలహాలను ఇవ్వాలని కోరారు. ఆడిటింగ్ వ్యవస్థ బలహీనంగా ఉందని, సీఈఓ మరియు చైర్మన్ ఆడిటింగ్ వ్యవస్థ ను చక్కగా సరిద్దిద్దాలని సూచించారు. 

క్రమం తప్పకుండా సమీక్ష, నియంత్రణ, పరపతి విధానం, అవినీతి ఆరోపణలు నిరూపణ  అయిన వారిపై చర్యలు, లీగల్ సెల్ ఏర్పాటు  చేయాలని సూచించారు. అలాగే కౌలు  రైతులకు కూడా అండగా వుండాలని ఆయన ఆదేశించారు. ఈ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. 

read more  ఏడాదిని రూ.20వేల కోట్ల అక్రమార్జన...: జగన్ పై మాజీ మంత్రి ఆరోపణలు

తమ రైతు ప్రభుత్వం రైతులకు అన్ని సమయాల్లో మరీముఖ్యంగా కష్టకాలాల్లో త్వరితగతిన పరపతి మరియు రుణాలు అందించాలని ఆయన అన్నారు. ఈ  సమీక్షలో సహకార శాఖ స్పెషల్ కమిషనర్ వాణి మోహన్ , ఆబ్కాబ్, డీసీసీబీ చైర్మన్ లు, సీఈఓ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

click me!