ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తోంది. ఒక్క కూరగాయల వ్యాపారి నుంచి గోరంట్లలో 26 మందికి కరోనా వైరస్ సోకింది. ఒక్క రోజులో 23 మందికి సోకింది.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. గుంటూరు జిల్లాలోని గోరంట్లలో ఓ కూరగాయల వ్యాపారి నుంచి 24 మందికి కరోనా వైరస్ వ్యాపించింది. ఆ వ్యాపారి ఇంట్లోని ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
మార్కెట్లోని 18 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇంటి పక్కవాళ్లకు ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. ఒక్క రోజులోనే 23 మందికి వైరస్ సోకింది.మార్కెట్లోని 250 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
undefined
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా వైరస్ వ్యాప్తిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 82 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3200కు చేరుకుంది. కోవిడ్ -19తో ఇప్పటి వరకు రాష్ట్రంలో 64 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్ ను పరీక్షించగా 82 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 40 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఏ విధమైన మరణాలు కూడా సంభవించలేదు.
ఇప్పటి వరకు మొత్తం 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, 927 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 112 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. యాక్టివ్ కేసులు 111 ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 479 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వారిలో 282 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మిగతావారు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.