Samantha: సమంత కష్టం వృధా? పట్టించుకోని దర్శక, నిర్మాతలు?

By Surya Prakash  |  First Published Apr 28, 2022, 6:22 AM IST

సినిమాకు కొంచెం కూడా బజ్ రాకపోవటంతో బిజినెస్ యాంగిల్ లో కూడా కలిసి రాలేదు.  సినిమా కి పెద్దగా ప్రమోషన్స్ లేవు. ఆఖరికి సమంత ఈ సినిమా చేస్తున్న సంగతి కూడా చాలా మందికి తెలీదు.  


కొన్ని సినిమాలు కమిటయ్యేటప్పుడు హీరో,హీరోయిన్స్  చాలా ఎక్సైట్ అవుతారారు. దాంతో రెమ్యునరేషన్ కూడా ఎంత ఇచ్చినా పుచ్చుకుని తమకు పేరు తెస్తుందని ముందుకు వెళ్ళిపోతారు. అయితే కొంతదూరం వెళ్లాక ఆ ప్రాజెక్టు అనుకున్న స్దాయిలో ప్రమోట్ కాకపోయినా, జనం నుంచి ప్రమోషన్ యాక్టివిటిస్ కు స్పందన రాకపోయినా నీరసం వస్తుంది. నిరాశ కలుగుతుంది. అలాంటిదే ఇప్పుడు సమంతకు  "శాకుంతలం" చిత్రం విషయంలో జరుగుతోంది అంటున్నారు.

2015లో రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణశేఖర్ చాలా కాలం పాటు  'హిరణ్యకశ్యప' అనే భారీ పౌరాణిక చిత్రాన్ని చేయడానికి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బిజీ అయిపోయారు. అయితే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళాలి ఆనుకున్న క్రమంలో లాక్ డౌన్ రావడంతో అ సినిమాని ఇప్పుడు తెరకెక్కించడం సరికాదు అని భావించి మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా 'శాకుంతలం' పేరుతో ఒక ఆహ్లాదకర ప్రేమకథని తన కొత్త సినిమాగా తెరకెక్కిస్తునట్టుగా గుణశేఖర్ ప్రకటించారు. పూర్తి చేసారు. 

Latest Videos

సమంత హీరోయిన్ గా "శాకుంతలం" తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు కానీ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోవటం చిత్ర టీమ్ ని నిరాశపరిచింది. అలాగే సినిమాకు కొంచెం కూడా బజ్ రాకపోవటంతో బిజినెస్ యాంగిల్ లో కూడా కలిసి రాలేదు. అయితే ఇక్కడో విషయం.. "శాకుంతలం" సినిమా కి పెద్దగా ప్రమోషన్స్ లేవు. ఆఖరికి సమంత ఈ సినిమా చేస్తున్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. దాంతో  సమంత తన కెరియర్ కోసం పడిన కష్టం  బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయని అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నారు.

 సినిమాల పై దృష్టి పెట్టిన సమంత ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. కానీ ఈ సినిమా గురించి ఎటువంటి బజ్ లేకపోవటం, ఆఖరికి చిత్ర దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా విషయంలో మౌనం వహించటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టక పోవటం అభిమానులు దిగులు పడేలా చేస్తున్నాయి. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కిస్తునట్టుగా గుణశేఖర్ వెల్లడించారు. ఈ సినిమాని గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తుండగా, మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

click me!