కేజిఎఫ్ 3 సినిమా కు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది.భారీ ఎత్తున మూడవ పార్ట్ ను ప్రశాంత్ నీల్ చేయబోతున్నాడు అంటున్నారు. అదే సమయంలో మరో ప్రచారం మొదలైంది. కేజీఎఫ్ 3 లో ప్రభాస్ ఉండబోతున్నాడు అంటున్నారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ' కేజీఎఫ్ 2' .. ఎక్సపెక్టేషన్స్ ని దాటుకుని దూసుకుని వెళుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ రాక్ స్టార్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. విడుదలైన ప్రతి ఏరియాలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. హిందీలో అయితే తొలి రోజు నుంచే ఈ సినిమా దూకుడు మామూలుగా లేదు. చాలా వేగంగా 100 కోట్లను కొల్లగొట్టిన హిందీ వెర్షన్ అదే ఊపును కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ ఈ చిత్రం తర్వాత పార్ట్ పై పడింది. ‘కేజీఎఫ్’ రెండో పార్ట్ చివర్లో ఈ మూవీకి మరో సిక్వెల్ రాబోతుందనే దర్శకుడు ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు.
దాంతో ఇప్పటి నుండే కేజిఎఫ్ 3 సినిమా కు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది.భారీ ఎత్తున మూడవ పార్ట్ ను ప్రశాంత్ నీల్ చేయబోతున్నాడు అంటున్నారు. అదే సమయంలో మరో ప్రచారం మొదలైంది. కేజీఎఫ్ 3 లో ప్రభాస్ ఉండబోతున్నాడు అంటున్నారు.సలార్ సినిమా తో ప్రస్తుతం ప్రభాస్ తో వర్క్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఇదే సమయంలో కేజీఎఫ్ 3 సినిమా కు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ని కేజీఎఫ్ 3 లో గెస్ట్ గా కనపడమని అడిగారని, తప్పకుండా ఈ సినిమా లో నటిస్తానని మాట ఇచ్చారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది మాత్రం క్లారిటీ లేదు.
ఇక కేజీఎఫ్ 3 కథ విషయానికి వస్తే... ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా చివర్లో రాఖీభాయ్ సముద్రంలో పడిపోతాడు. విలన్లు రాఖీభాయ్ ఉన్న షిప్ ను క్షిపణులతో టార్గెట్ చేశారు. సీన్ కట్ చేస్తే.. రాఖీ రక్తపు మరకల్లో సముద్రం నీళ్లలో కన్పిస్తాడు. బంగారమంతా సముద్రంలో కలిసిపోతుంది. దీంతో రాఖీబాయ్ బ్రతికి ఉంటాడని.. సబ్ మైరన్ ద్వారా గోల్డ్ ను సముద్రంలో దాచి ఉంటాడనే టాక్ విన్పిస్తోంది. దీని ఆధారంగానే ‘కేజీఎఫ్ 3’ కథ ఉండబోతుందనేలి ఒక్క ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. గ్యాంగ్స్ స్టర్ ఎస్కేప్ యూజింగ్ సబ్మెరైన్ అని హెడ్ లైన్స్ తో ఈ పిక్ దర్శనమిస్తోంది. ఈ సినిమాలో 1978 నుంచి 81 వరకు ఏం చేశాడు అన్నది దర్శకుడు చూపించలేదు. ఈ సమయంలో రాఖీభాయ్ గనులను ఆక్రమించుకున్న క్రిమినల్స్ పని పడతాడని తెలుస్తోంది. ఈక్రమంలోనే కేజీఎఫ్ 3 స్టోరీ విదేశాల్లో స్టార్ట్ అవుతుందనే టాక్ విన్పిస్తోంది.