Salaar: ‘సలార్‌’ఇంట్రవెల్ బడ్జెట్...ఐదు చిన్న సినిమాలు తీయచ్చు

By Surya Prakash  |  First Published Apr 26, 2022, 12:31 PM IST

 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేదానిమీదే పూర్తి దృష్ఠిపెట్టారు ప్రభాస్. 



రెండు వారాల క్రితం విడుదలైన కేజీఎఫ్ 2తో ప్రశాంత్ నీల్ మరో సారి  దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ స్టార్ట్ అవడంతో పాటు మౌత్ టాక్ కూడా అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు తర్వాత చిత్రం సలార్ గురించి జనం మాట్లాడటం మొదలైంది. అసలు  KGF 2 తో పాటే సాలార్ టీజర్ థియోటర్స్ కు వస్తుందని రూమర్స్  వచ్చాయి. కానీ అది జరగలేదు. KGF నిర్మాతలు సాలార్‌ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం గురించిన ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అదేమిటంటే...ఈ సినిమా ఇంట్రవెల్ ఎపిసోడ్ కు ఇరవై కోట్లు బడ్జెట్ కేటాయించారట.  భారీ ఫైట్ ఎపిసోడ్ అని, విజువల్ గా షాకింగ్ గా ఉంటుందని, ఇప్పటిదాకా తెరపై రాని ఎపిసోడ్ అని చెప్తున్నారు. ఈ బడ్జెట్ తో ఐదు చిన్న సినిమాలు తీయచ్చు అంటున్నారు

Latest Videos

ఇక KGF 2 హైప్ సాలార్‌కి కూడా హెల్ప్ కావాలని నిర్మాతలు  కోరుకుంటున్నారు. సాలార్ ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో మళ్లీ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. నేను ఇప్పటి వరకు రాసిన అత్యంత వైలంట్ క్యారక్టర్ సాలార్ అని ప్రశాంత్ నీల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన సూపర్‌హిట్ చిత్రం ఉగ్రమ్‌కి సాలార్ రీమేక్ కాదని కూడా అతను ధృవీకరించాడు. “నా ప్రతి చిత్రానికి ఉగ్రమ్‌కి కొంత అనుబంధం ఉంటుంది. అయితే సలార్‌ రీమేక్‌ కాదు. ఇదొక ఫ్రెష్‌ స్టోరీ’’ అని చాలా కాలంగా సాలార్‌పై వస్తున్న రూమర్‌పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
 
ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’క్రిందటి నెలలో విడుదల అయ్యి డిజాస్టర్ అయ్యింది. దాంతో అందరి దృష్టీ ప్రభాస్ తర్వాత సినిమాపై ఉంది. ఇప్పటికే బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేదానిమీదే పూర్తి దృష్ఠిపెట్టారు ప్రభాస్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్టు సమాచారం. మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

 ‘సలార్‌’ని త్వరగా పూర్తి చేసి, ‘ప్రాజెక్ట్ k’పై దృష్ఠి సారించాలని ఇప్పుడు ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారట. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘సలార్’లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ నేపధ్యంలో శృతి హాసన్ పాత్ర ఏమిటి...ఆమె పాత్రకు ఉన్న ట్విస్ట్ ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీకొడుకులుగా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్ లోని యాక్షన్ సీన్లు నెక్ట్స్  లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. అలాగే శృతి హాసన్ జర్నలిస్ట్ గా కనిపించబోతుందిట. ప్రభాస్ తో ప్రేమలో పడుతుందిట. ప్రభాస్, శృతి మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్ గా ఉంటాయని క్లైమాక్స్ లో శృతిహాసన్ పాత్ర చనిపోతుందని సమాచారం అందుతోంది.   ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా శ్రద్ధా కపూర్ ఆ సాంగ్ లో కనిపిస్తారని తెలుస్తోంది. 

 ఆది పురుష్ తో పాటు డార్లింగ్ ఇందులో కూడా సమాంతరంగా పాల్గొంటాడని ఫిలిం నగర్ టాక్. సలార్ ఏ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందనే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది కాబట్టి మాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.
 

click me!