Rana: శేఖర్ కమ్ముల 'లీడ‌ర్ 2' పట్టాలెక్కుతుందా? ప్లాబ్లం ఏంటి ?

By Surya Prakash  |  First Published Mar 6, 2022, 9:02 AM IST

ఆ తర్వాత శేఖర్ కమ్ముల, రానా కాంబోలో సినిమాలు రాలేదు. హిట్ సినిమాకు సీక్వెల్ కావాలనుకుంటారు. అందుకే  లీడ‌ర్ 2 చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. కానీ... కుద‌ర‌డం లేదు. రానా కూడా లీడ‌ర్ 2 చేయాల‌ని ఉత్సాహపడుతున్నాడు.


భీమ్లానాయక్ తో దుమ్ము రేపిన దగ్గుపాటి రానా తొలి చిత్రం  'లీడర్'. ఆ చిత్రంతోనే 2010వ సంవత్సరంలో రానా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పొలిటికల్ డ్రామా. సినిమా పెద్దగా ఆడలేదు కానీ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాల్లోనే ఓ మంచి క్లాసిక్ గా నిలబడిపోయింది.

ఆ తర్వాత శేఖర్ కమ్ముల, రానా కాంబోలో సినిమాలు రాలేదు. హిట్ సినిమాకు సీక్వెల్ కావాలనుకుంటారు. అందుకే  లీడ‌ర్ 2 చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. కానీ... కుద‌ర‌డం లేదు. రానా కూడా లీడ‌ర్ 2 చేయాల‌ని ఉత్సాహపడుతున్నాడు. శేఖర్ కమ్ముల చేసేద్దాం అన్నట్లు చెప్తున్నాడు కానీ మొదలెట్టడం లేదు. ప్రతీసారీ మీడియాతో రానా మాట్లాడినప్పుడల్లా ఈ సినిమా టాపిక్ వస్తోంది.

Latest Videos

వరసగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమా త‌ర‌వాత సినిమా ప‌ట్టాలెక్కించుకుంటూ వెళ్తున్నాడు కానీ, లీడ‌ర్ 2 ఊసు తీయ‌డం లేదు. మ‌రోవైపు రానా మాత్రం `నాకు లీడ‌ర్ సీక్వెల్ చేయాల‌ని ఉంది` అని ప్ర‌తీ సంద‌ర్భంలోనూ చెబుతూనే ఉన్నాడు. తాజాగా త‌న మ‌న‌సులోని మాట మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు రానా.. "శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది"  అని చెప్పేశాడు రానా.

అయితే అందుతున్న సమాచారం మేరకు ...శేఖ‌ర్ క‌మ్ముల కూడా లీడ‌ర్ 2పై ఇంట్రస్ట్ గా ఉన్నాడు. కానీ స‌రైన‌క‌థ దొర‌డం లేదు. లీడ‌ర్ 2 పేరుతో మ‌రో రొటీన్,రెగ్యులర్  పొలిటిక‌ల్ డ్రామా చేయ‌డం శేఖ‌ర్ క‌మ్ముల‌కు ఇష్టం లేదు. మంచి స్టోరీ లైన్ కోసం ఆయ‌న వెతుకుతున్నారు. అందుకే ఇంత ఆలస్యమవుతోంది. త్వ‌ర‌లోనే ధ‌నుష్ తో ఓ సినిమా చేయ‌బోతున్నారాయ‌న‌. అది పూర్త‌వ్వ‌గానే లీడ‌ర్ 2 ఉండే అవకాశం ఉందంటున్నారు.

click me!