Sagar K Chandra :‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ హీరో, టైటిల్

By Surya Prakash  |  First Published Mar 5, 2022, 2:59 PM IST

 పవన్, రానా ల కాంబినేషన్ `భీమ్లా నాయ‌క్‌`తో కమర్షియల్ రేసులోకి వ‌చ్చాడు సాగ‌ర్ చంద్ర‌. ఈ సినిమాతో ఓ క‌మ‌ర్షియ‌ల్ హీరోని హ్యాండిల్ చేయ‌గ‌ల‌డు అనే న‌మ్మ‌కం నిర్మాతలకు ఏర్ప‌డింది. ఈ దర్శకుడు నెక్ట్స్ ప్రాజెక్టు ఏ హీరోతో చెయ్యబోతున్నారు...



శివాజీ,రాజేంద్రప్రసాద్ లతో  ‘అయ్యారే’, నారా రోహిత్, శ్రీ విష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు సాగర్ చంద్ర. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల నుంచి కూడా ప్రశంశలు దక్కించుకున్నాయి. ఆ తర్వాత పవన్, రానా ల కాంబినేషన్ `భీమ్లా నాయ‌క్‌`తో కమర్షియల్ రేసులోకి వ‌చ్చాడు సాగ‌ర్ చంద్ర‌. ఈ సినిమాతో ఓ క‌మ‌ర్షియ‌ల్ హీరోని హ్యాండిల్ చేయ‌గ‌ల‌డు అనే న‌మ్మ‌కం నిర్మాతలకు ఏర్ప‌డింది. ఈ దర్శకుడు నెక్ట్స్ ప్రాజెక్టు ఏ హీరోతో చెయ్యబోతున్నారు...టైటిల్ ఏంటనే విషయమై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం మేరకు...తెలుగు లో భారీ నిర్మాణ సంస్దగా పేరు తెచ్చుకున్న ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో ఓసినిమా చేయ‌డానికి సాగ‌ర్ ఇది వ‌ర‌కే ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. సాగ‌ర్ ద‌గ్గ‌ర రెండు క‌థ‌లు ఉన్నాయి. రెండూ క‌మ‌ర్షియ‌ల్ స్టోరీలే అని తెలుస్తోంది. వాటిలో ఓ సినిమాకి `టైస‌న్ నాయుడు` అనే టైటిల్ అనుకుంటున్నారు.

Latest Videos

భీమ్లానాయక్ కు ముందు   వరుణ్ తేజ్ కి కథ వినిపించాడు. కథ కూడా ఓకే అయిపొయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ వరకు మొదలు కాకుండానే ఆగిపోయింది. అయితే బాబాయి పవన్ కి హిట్ ఇవ్వడంతో వరుణ్ తేజ్ అప్పటి సినిమాని సాగర్ తో కలిసి పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు. ఆ సినిమా బడ్జెట్ ఎక్కువైనా ఇప్పుడు వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట.  
 
‘భీమ్లా నాయక్’ చూసిన వెంటనే దర్శకుడు సాగర్ ని వరుణ్ పిలిచి మరీ మాట్లాడాడని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ నుంచి గని, ఎఫ్ 3 సినిమాలు రాబోతున్నాయి. వీటి తర్వాత ఇంకా ఏ సినిమాని అన్నౌన్స్ చేయలేదు. ఈ రెండు రిలీజ్ కి రెడీ అవ్వడంతోఈ ప్రస్తుతం వరుణ్   కథలు వింటున్నాడు. దీంతో సాగర్ కి మరోసారి కథ చెప్పమని అడిగినట్లు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సాగర్ మరోసారి మెగా హీరోతో సినిమా చేసి సెట్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు.

 

click me!