తాజాగా రాజమౌళి ని సోషల్ మీడియాలో ఓ వర్గం టార్గెట్ చేస్తోంది. రాజమౌళి ఒక సినిమా ముహూర్త కార్యక్రమానికి హాజరవడం ద్వారా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏమిటా విషయం, విమర్శలు అంటారా...
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ విషయమై అవసరమా...అనవసరమా అనే తేడా లేకుండా డిస్కషన్ జరుగుతోంది. ప్రతీ చిన్న విషయాన్ని బూతద్దంలో చూపెడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీల విషయాలలో అది మరీ ఎక్కువగా ఉంటోంది. వారుక్యాజువల్ గా చేసే దినవారి కార్యక్రమాలను సైతం విమర్శలతో నింపేస్తున్నారు. తాజాగా రాజమౌళి ని సోషల్ మీడియాలో ఓ వర్గం టార్గెట్ చేస్తోంది. రాజమౌళి ఒక సినిమా ముహూర్త కార్యక్రమానికి హాజరవడం ద్వారా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏమిటా విషయం, విమర్శలు అంటారా...
. తెలుగువాడైన కర్ణాటక వ్యాపారవేత్త, రాజకీయ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి తన కొడుకు కిరీటిని హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు రోజుల క్రితం శుక్రవారం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ వేడుకకు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. గాలి జనార్దనరెడ్డితో కలిసి వేదికను పంచుకున్నాడు. ఆ ఫొటోలు నెట్ లోకి వచ్చాయి. దాంతో గాలి జనార్దనరెడ్డితో రాజమౌళి చూసి నెటిజన్లు,ఓ వర్గం మీడియా విమర్శలు గుప్పిస్తోంది. గాలి అవినీతి చరిత్ర ని తిరగతోడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఓబులాపురం గనుల్లో అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆయన తీవ్ర నేరారోపణలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు.
అలాగే మైనింగ్ కేసులు ఆయనపై నమోదై జైలు పాలయ్యారు. బెయిల్ కోసం జడ్జికి భారీగా లంచం ఇచ్చారని కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తితో ఎలా రాజమౌళి వేదిక పంచుకుంటారంటున్నారు. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా లోక్ సత్తాకు మద్దతు ఇచ్చి, ఆ పార్టీకి ప్రచారం కూడా చేసిన రాజమౌళి.. ఇప్పుడు ఇలా గాలి జనార్దనరెడ్డి కుటుంబ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ఆయనతో సన్నిహితంగా కనిపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది రాజమౌళి మిత్రుడైన సాయి కొర్రపాటి కావడం వల్లే ఈ వేడుకకు వచ్చారు. ఆ విషయం మర్చిపోతున్నారు.