'అల వైకుంఠపురములో' వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునేవాడంట. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడంట. ఇక ఈ ఏడాది క్రాక్, వకీల్‌సాబ్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో.. మరో 50 లక్షలు పెంచాడని టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ అంటే తమన్ అని చెప్తాము. ఫుల్ జోష్ లో ఉన్న తమన్ ఈ ఏడాది 'క్రాక్', 'వకీల్‌సాబ్', 'అఖండ ' , నాని 'టక్ జగదీశ్' ఇలా పెద్ద సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్‌లో ఉన్నాడు. మెలోడీలతో పాటు మాస్ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్ చేయటం స్పెషాలిటీగా తమన్ రచ్చ చేస్తున్నారు ప్రస్తుతం తమన్ బాలకృష్ణ 'అఖండ', మహేశ్ బాబు 'సర్కారు వారి పాట', పవన్ కల్యాణ్ 'భీమ్లానాయకు',అఖిల్ 'ఏజెంట్', శంకర్- రామ్‌చరణ్ మూవీ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్.. తాజాగా తన రెమ్యునరేషన్‌ని కూడా భారీగా పెంచేశాడనే టాక్ మొదలైంది. ఈ నేపధ్యంలో అసలు తమన్ ఎంత తీసుకుంటున్నారనే విషయమై మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో వంద చిత్రాలకు పైగా సంగీతం అందించిన తమన్.. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాతికేళ్లకు పైగానే అయింది. 6వ తరగతిలోనే చదువుకు స్వస్థి పలికి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టిన తమన్.. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు. ఆయన సంగీతం అందించిన `భైరవ ద్వీపం` సినిమాకు డ్రమ్స్ వాయించి.. రూ. 30 మొదటి పారితోషకంగా అందుకున్నాడు. ఆ తర్వాత ప్రముఖుల సపోర్ట్‌తో పలు అవకాశాలు అందుకున్న ఈయన ఒక్కో మెట్టు ఎక్కుతూ.. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు.
అయితే తనదైన సంగీతంతో సినిమాలపై భారీ హైప్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న తమన్.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడట. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం.. చిన్న సినిమా అయినా స్టార్ హీరోల సినిమా అయినా రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు తమన్ రెమ్యూనరేషన్‌గా పుచ్చుకుంటున్నాడట.
'అల వైకుంఠపురములో' వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునేవాడంట. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడంట. ఇక ఈ ఏడాది క్రాక్, వకీల్‌సాబ్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో.. మరో 50 లక్షలు పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తమన్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు అందుకుంటున్నాడంట. కొన్ని సినిమాలకు బడ్జెట్‌ని బట్టి తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. కథ నచ్చితే తక్కువ తీసుకోనైనా సంగీతం అందిస్తాడని ఇండస్ట్రీలో తమన్‌కు మంచి పేరుంది. ఇక రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది.
ఇక ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న వార్తలపై కూడా థమన్ స్పందించారు. తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలేమి ఫూల్స్ కాదని.. తన మ్యూజిక్‌కు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో అంతే స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తారని థమన్ చెప్పారు. ఇక తనకు ఇచ్చే రెమ్యునరేషన్ అంతా తనకే రాదని.. మొత్తం రెమ్యునరేషన్‌లో 50 శాతం మాత్రమే తనకు వస్తుందని చెప్పాడు. మిగిలిన 50 శాతం సౌండ్ ఇంజనీర్లు, ప్రొఫెషనల్ మ్యూజిక్, ఇన్‌స్ట్రమెంట్స్ ప్లేయర్స్‌తో పాటు సింగర్లు ఇలా వీళ్లందరికి వెళ్లిపోతుందని థమన్ చెప్పాడు.