ఈ సినిమా స్క్రిప్టు విషయంలో దర్శకుడు సుధీర్ వర్మ అనుమతి లేకుండా మరో దర్శకుడు ఆనంద్ రంగా చేత మార్పులు, చేయించారని, కొంత ప్యాచ్ వర్క్ చేయించినట్లు చెప్పుకుంటున్నారు. అందుకే దర్శకుడు అయిన సుధీర్ వర్మకు కోపం వచ్చినట్లు సమాచారం.
యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న చిత్రం ‘శాకిని ఢాకిని’ (Shakini Dhakini). ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నివేదా థామస్ (Nivetha Thomas), రెజీనా కసాండ్రా (Regina Cassandra) లీడ్ రోల్స్ లో నటించారు. మొదట ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.సెప్టెంబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది శాకిని డాకిని.
ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. కానీ డైరక్టర్ ఈ ప్రమోషన్స్ కు హాజరు కావటం లేదు. రామానాయుడులో జరిగిన ప్రెస్ మీట్ కు, క్వచ్చిన్స్, ఆన్స్రర్స్ సెక్షన్ కు కూడా హాజరు కాలేదు. ఈ సినిమా గురించి చిన్న ట్వీట్ కూడా చేయటం లేదు. అందుకు కారణం ...డైరక్టర్ కు చిత్ర నిర్మాత సురేష్ బాబు కు మధ్య వచ్చిన చిన్న మాట పట్టింపులు కారణం అంటున్నారు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో దర్శకుడు అనుమతి లేకుండా మరో దర్శకుడు ఆనంద్ రంగా చేత మార్పులు, చేయించారని, కొంత ప్యాచ్ వర్క్ చేయించినట్లు చెప్పుకుంటున్నారు. అందుకే దర్శకుడు అయిన సుధీర్ వర్మకు కోపం వచ్చినట్లు సమాచారం. అందుకే ప్రమోషన్స్ కు దూరం గా ఉంటున్నారని అంటున్నారు.
అయితే ఈ సంస్ద మాత్రం ఖండిస్తోంది.అతను పెద్ద డైరక్టర్, అతను వేరే పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పుడు ప్రమోషన్స్ కు పిలవటం పద్దతి కాదని వద్దనుకున్నాం అని చెప్తోంది. అయితే మీడియా అవన్ని నమ్మలేం అన్నట్లు చూస్తోంది. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మికీ ఎంసీ క్లియరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇక శాకిని- ఢాకినిచిత్రం విషయానికి వస్తే.... నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుధీర్ వర్మ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. మాతృక అయిన కొరియన్ డ్రామాలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే ఈ తెలుగు రీమేక్ లో ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయిస్తూ దర్శకుడు ఉమెన్ సెంట్రిక్ మూవీగా దీనిని మార్చాడు. అయితే ఇటీవలే షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రానికి ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్ ఖరారు చేసి ఓటీటిలో రిలీజ్ చేస్తున్ారు.
పోలీస్ ఆఫీసర్ ట్రైనీలుగా ఉండే ఇద్దరు అమ్మాయిలు ఊహించని విధంగా ఉమెన్ ట్రాఫికర్స్ గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది. మానవ రవాణా ముఠా నుండీ తమని తాము ఎలా రక్షించుకున్నారు? మిగిలిన వారిని ఎలా రక్షించారన్నదే ఈ చిత్ర కథ. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఈ ఇద్దరు హీరోయిన్‌ల క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.