గత ఏడాది అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం పుష్ప పార్ట్ 1 ఇరవై రోజులకే వరల్డ్ ప్రీమియర్ చేసినప్పుడు ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గలేదు. ఎగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్లకు తప్పదు అని స్ట్రీమింగ్ పెట్టేసింది.
మహానటి చిత్రంతో తెలుగు వాళ్లకి దగ్గరైన దుల్కర్ సల్మాన్ ....ఈ సారి తెలుగులో సోలోగా స్ట్రైయిట్ సినిమాతో పలకరించాడు. అలాగే నటిగా మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది. వీళ్లిద్దరి కాంబినేషన్ కు రష్మిక సైడ్ కిక్ లా సెట్టైంది. దాంతో క్రేజ్ పీక్స్ కు వెళ్ళింది. దానికి తోడు ఇది కూల్ లవ్ స్టోరీ కావటం,త పెద్ద బ్యానర్ నిర్మించటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. వాటిని చాలా వరకూ ఈ సినిమా నిలబెట్టుకుందనే చెప్పాలి. మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉన్నట్లు అనిపించిన ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర బాగా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడీ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
సీతారామం ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాను సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఈ సినిమా హిందీ వెర్షన్ రీసెంట్ గా విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటిలో వస్తే ఎంతో కొంత దెబ్బ పడటం ఖాయం. హిందీ లో కూడా మంచి టాక్ రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో అమేజాన్ ప్రైమ్ ని సీతారామం నిర్మాతలు కాస్త లేటుగా రిలీజ్ పెట్టుకోమని రిక్వెస్ట్ చేసారట. కానీ అమెజాన్ సంస్ద మొదట ఏ ఎగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్లాలనుకున్నామో ... అదే పద్దతిలో వెళ్తామని చెప్పి...రిలీజ్ డేట్ ఇచ్చేసింది.
A tale of love and love letters that stands timeless 💌, Sept 9
pic.twitter.com/bRo4fHs26m
గత ఏడాది పుష్ప పార్ట్ 1 ఇరవై రోజులకే వరల్డ్ ప్రీమియర్ చేసినప్పుడు ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గలేదు. ఎగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్లకు తప్పదు అని స్ట్రీమింగ్ పెట్టేసింది. ఇప్పుడు సీతారామంకు సైతం అదే పరిస్దితి. కాకపోతే బాలీవుడ్ వెర్షన్ ని కొంత లేట్ చేసే అవకాసం ఉండచ్చు అంటున్నారు.
'సీతా రామం' చిత్రం కథేమిటంటే..... లెఫ్టినెంట్ రామ్ (దుల్ఖర్ సల్మాన్) ఓ అనాధ. అతను హైదరాబాద్‌లో ఉండే సీతామహాలక్ష్మి (మృణాళ్ ఠాకూర్) కి ఓ ఉత్తరం రాస్తాడు. కానీ అది ఆమెకు చేరదు. పాకిస్దాన్ లో గత ఇరవై ఏళ్లుగా ఉండిపోతుంది. దాన్ని సీతకి అప్పగించే బాధ్యత ఆఫ్రిన్ (రష్మికామందణ్ణ)పై తీసుకుంటుంది. ఆమె పాకిస్తాన్ ఆర్మీ అధికారి(సచిన్ ఖేడ్కర్) మనవరాలు. ఆ ఉత్తరం ఖచ్చితంగా అందచేయాల్సిన పరిస్దితి. అది సీతను వెతికి ఇవ్వకపోతే ఆమెకు తన తాత ఆస్దిలో పైసా కూడా దక్కదు. వేరే దారి లేక ఆమె ఆ ఉత్తరం పట్టుకుని హైదరాబాద్ లో లాంచ్ అవుతుంది. ఆమె సీతను వెతకటం మొదలెడుతుంది. ఈ క్రమంలో అసలు ఆ ఉత్తరంలో ఏముంది..అంత ముఖ్యమైన ఉత్తరమా అది...అసలు అంత ఇంపార్టెంట్ ఉత్తరం పాకిస్దాన్ లో పాతికేళ్లు ఎందుకు ఉండిపోయింది....అఫ్రిన్ ఆ ఉత్తారాన్ని చేరవేయగలిగిందా...సీతకు రామ్ కు మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి....అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.