మణిరత్నం ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు. ఇందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఓ పెద్ద సినిమాని రిలీజ్ చేసేటప్పుడు ప్రమోషన్స్ విరివిగా చేస్తూంటారు. ఆ సినిమా స్దాయిని బట్టే ప్రమోషన్స్ ఉంటాయి. అందుకు ఉదాహరణగా బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ , రీసెంట్ గా లైగర్ చెప్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఏదో విధంగా వార్తల్లో ఉండేలా చూస్తారు. అయితే మణిరత్నం చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’కి తెలుగులో ప్రమోషన్ ఆ స్దాయిలో జరగటం లేదు. సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కానుంది. తమిళంలో భారీగా బజ్ ఉన్న ఈ సినిమా తెలుగులో అసలు రిలీజ్ అవుతుందనే విషయం చాలా మందికి తెలియని పరిస్దితి నెలకొని ఉంది. ఇది మణిరత్నం అభిమానులను బాధిస్తోంది.
మణిరత్నం సినిమాలు గతంలో ఇక్కడ సూపర్ హిట్స్ నమోదు చేసాయి. ఆయనకు ఇక్కడ చెక్కు చెదరని ఫ్యాన్స్ ఉన్నారు. వారు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు పై కోపం వెళ్లగక్కుతున్నారు. అయితే ఇక్కడో విషయం చెప్పుకోవాలి. తెలుగుకు ఆ సినిమా డబ్బింగ్ సినిమానే. రిలీజ్ కు ముందు ఓ వారం పాటు ప్రమోషన్స్ చేస్తారు. దిల్ రాజు రిలీజ్ కాబట్టి మంచి థియేటర్స్ దొరుకుతాయి. అంతకు మించి ఎక్సపెక్ట్ చేయలేము. ఎందుకంటే ‘పొన్నియిన్ సెల్వన్’ తమిళ వారి చరిత్ర. తెలుగుకు ఎంతవరకూ ఎక్కుతుందనేది తెలియదు.
ఏదైమైనా ఈ యేడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ తెలుగు థియేట్రికల్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు దక్కించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నాడు.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. మొదటి భాగం సెప్టెంబర్ 30న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు