కన్నడ హీరో శివరాజ్ కుమార్ 'మఫ్టీ' అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశారు. ఆ చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించింది . ఈ చిత్ర దర్శకుడు నర్తన్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
హిట్ కొట్టిన దర్శకులు తమ నెక్ట్స్ ప్రాజెక్టులకు స్టార్ హీరోలు చుట్టూ తిరుగుతూంటారు. అదే విధంగా స్టార్ హీరోలు సైతం ఎక్కడ ఏ భాషలో ఓ దర్శకుడు హిట్ కొట్టినా వారితో చేయటానికి ఉత్సాహం చూపిస్తూంటారు. అదే విధంగా ఇప్పుడు రామ్ చరణ్ తో ,ఓ కన్నడ దర్శకుడు కథ వినిపించి సినిమా చేయటానికి ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే...
కన్నడ హీరో శివరాజ్ కుమార్ 'మఫ్టీ' అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశారు. ఆ చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించింది . ఈ చిత్ర దర్శకుడు నర్తన్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం స్టోరీ లైన్ ఇప్పటికే రామ్ చరణ్ విన్నట్లు ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే జెర్సీ డైరక్టర్ గౌతం తిన్ననూరితో చరణ్ సినిమా ఉండాల్సి ఉంది.కానీ సెకండాఫ్ సెట్ కాక చరణ్ ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్ోతంది.
ఈ క్రమంలో రామ్ చరణ్ 16వ సినిమా కన్నడ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.తొలి సినిమాతోనే కన్నడలో సూపర్ హిట్ కొట్టిన నర్తన్ డైరక్షన్ లో చరణ్ 16వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. నర్తన్ గతంలో ప్రశాంత్ నీల్ దగ్గర పనిచేసారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన మఫ్టీ సినిమా అతనికి అది మొదటి ప్రయత్నమే. అయినా సరే తొలి సినిమా దర్శకుడిగా కాకుండా ఎంతో అనుభవం ఉన్న వాడిగా సినిమా తీసి హిట్ అందుకున్నాడు. తెలుగులోనూ చరణ్ తో సెట్ అయ్యి హిట్ కొడితే అతను తెలుగులోనూ పెద్ద దర్శకుడు అవుతాడనటంలో సందేహం లేదు.