మన తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్నంత మంది అభిమానులు ఏ హీరోకు కూడా లేరు. ఇది జగమెరిగిన సత్యం. వాళ్ల మాటకు ఆయన విలువ ఇస్తారు.
గత కొద్ది రోజులు గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తున్న టాపిక్ ...మామా అల్లుళ్ళ కాంబో ఉన్నట్టా? లేనట్టా?అనేది. ఆ మామా అల్లుళ్లు ఎవరో ఈ పాటికి గెస్ చేసే ఉంటారు. పవన్ అభిమానుల్లో చాలా మందికి ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తి లేదు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో పోస్ట్ లు ద్వారా తెలియచేస్తున్నారు. ఈ విషయమై పవన్ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
పవన్ కళ్యాణ్ మూవీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి? ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు ఆయన ఎప్పుడు పూర్తి చేస్తారు..? మరో ఏడాదిన్నరలోనే ఎన్నికలు రానుండటంతో.. ఇప్పటి నుంచే రాజకీయాల్లో బిజీ అయిపోయారు జనసేనాని. మరి ఆ జనాన్ని వదిలేసి.. మళ్లీ కెమెరా ముందుకొచ్చేదెప్పుడు..? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేదెప్పుడు..? కమిటైన సినిమాల్లో దేన్ని ముందు పూర్తి చేస్తారు..? వీటికి సమాధానం దొరికింది.
వివరాల్లోకి వెళితే.....ఇప్పుడు పూర్తి స్దాయిలో జనసేన పార్టీ కార్యకలాపాల్లో ఫుల్ బీజి అయ్యారు పవన్ కళ్యాణ్. దాంతో ఆయన సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు విడులవుతాయి? అనేవి దర్శక నిర్మాతలకు , అభిమానులకు కన్ఫ్యూజన్‌గా ఉంది. అయితే లక్కీగా.. పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) టీజర్‌తో అభిమానులకు ఆనందం కలిగించారు. ఈ ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేసారానే వార్తలకు చెక్ చెప్పగలిగారు. అంతేకాకుండా ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో పవన్ సైతం ఉత్సాహం తెచ్చుకుని ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టికున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో గత కొంతకాలంగా నలుగుతున్న ‘వినోదయ చిత్తం’ రీమేక్ విషయమై క్లారిటి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఖాయం చేయలేకపోయారు. కాకపోతే చిత్రం ఆగిపోయిందన్న పుకార్లకు మాత్రం చెక్ పెట్టగలిగారు. ఈ సినిమా పరిస్థితే ఇలా ఉంటే.. హరీశ్ శంకర్ (Harish Shankar) ‘భవదీయుడు భగత్‌సింగ్’ (Bhavadeeyudu Bhagathsingh) చిత్రం గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఫ్యాన్స్‌కు తన ట్వీట్లతో ఎలివేషన్స్ మాత్రం ఇస్తున్నాడు. సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అతడికే క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో
అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ తమిళ రీమేక్ చిత్రం ‘వినోదయ చిత్తం’ (Vinodaya chittam) ట్రాక్ ఎక్కడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ నుంచి తక్కువ కాల్షీట్స్ తీసుకొని.. కేవలం 20 రోజుల్లో ఆయన కాంబినేషన్ సీన్స్‌ను షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. దీని కోసం చాలానే హోం వర్క్ చేసినట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలో మరో ముఖ్యపాత్ర చేయిద్దామనుకున్న సాయిధరమ్ తేజ్ వేరే సినిమాలకు కమిట్‌మెంట్స్ ఇవ్వలేదు.
త్రివిక్రమ్ తన భాధ్యతగా ఫైనల్ వెర్షన్ రెడీ చేయించినా పవన్ ఆ ప్రాజెక్టుని కొంతకాలం ప్రక్కన పెడదామని నిర్ణయించుకున్నారట. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖని నే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సముద్రఖని ఆర్టిస్ట్ గా మూడు భాషల్లో వరుసగా నటిస్తున్నారు. ఈ లెక్కలను బట్టి ...ఈ చిత్రం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే అవకాశం లేదు.