#PawanKalyan:ఇక్కడ పవన్, అక్కడ అమితాబ్

By Surya Prakash  |  First Published Sep 7, 2022, 2:33 PM IST

ఇక్కడ పవన్ కళ్యాణ్ కు, అక్కడ అమితాబ్ కు ఉన్న క్రేజ్ తెలిసిందే. అందుకే చిరంజీవి సినిమా కోసంవీళ్లద్దరుని గెస్ట్ లుగా పిలవబోతున్నట్లు సమాచారం.  ఈ నెలాఖరున ఓ గ్రాండ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా తీసుకురావాలని భావిస్తున్నట్లు మీడియాలో సమాచారం వస్తోంది.



చిరంజీవి, పవన్ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులవుతున్న సంగతి తెలిసిందే. సైరా ఈవెంట్ తర్వాత మళ్ళీ స్టేజి పై ఇద్దరు కనిపించలేదు. అయితే ఆ అవకాసం మరోసారి అభిమానులకు కలగనుందని తెలుస్తోంది. మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న రిలీజ్ అవ్వబోతుంది. ఈ నెలాఖరున ఓ గ్రాండ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా తీసుకురావాలని భావిస్తున్నట్లు మీడియాలో సమాచారం వస్తోంది.

వాస్తవానికి ఈ సినిమాకు ఇప్పటిదాకా బజ్ క్రియేట్ కాలేదు. దాంతో ప్రమోషన్స్ ద్వారా కిక్ తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా  ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ఎలానో వస్తారు. కాబట్టి స్పెషల్ గెస్ట్ గా పవన్ వస్తే సినిమాకు క్రేజ్ వస్తుందని మెగా ఈవెంట్ హైలైట్ అవుతుందని మెగా క్యాంప్ భావిస్తోందని చెప్తున్నారు. ఈ క్రమంలో  పవన్ ని గెస్ట్ గా పిలవాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.  సల్మాన్ ఖాన్ ని హిందీ మార్కెట్ కు వర్కవుట్ అవుతారు. ముంబై లో కూడా హిందీ వెర్షన్ ప్రమోషన్స్  చేయబోతున్నారు. అక్కడ బిగ్ బీ అమితాబ్  ఈవెంట్ కి పిలవబోతున్నట్లు తెలుస్తోంది.
  
ఆచార్య ప్లాఫ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న సినిమా ఇది. చిరంజీవి  వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మలయాళంలో వచ్చిన లూసిఫర్ కు తెలుగు రీమేక్ అని తెలిసిందే. గాడ్ ఫాదర్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.
 
అందుకే ప్రమోషన్లను భారీగా చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్లు విడుదలైయ్యాయి. ఇవి ప్రేక్షకులపై పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. దీంతో ప్రమోషన్లను మరింత దూకుడుగా చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నారు.  
 

Latest Videos

click me!