Pawan Kalyan:బండ్ల- త్రివిక్రమ్ ఆడియో క్లిప్ పై పవన్ రియాక్షన్

By Surya Prakash  |  First Published Feb 23, 2022, 4:46 PM IST

 ''అజ్ఞాతవాసి లాంటి చెత్త సినిమా తీశాడు. భీమ్లా నాయక్ తేడా వస్తే త్రివిక్రమ్ ఇంటికెళ్ళి కొడత. వైసీపీ వాళ్లతో కుమ్మక్కై .. నన్ను వేడుకకి రాకుండా సైడ్ చేశాడు త్రివిక్రమ్'' ఇలా సాగింది బండ్ల గణేష్ ఆడియో సంభాషణ.



గత రెండు రోజులుగా  నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి సంబధించిన ఓ ఆడియో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదో సంచలనంగా మారింది. ఒక ఫోన్ కాల్ లో దర్శకుడు త్రివిక్రమ్ పై హద్దులుమీరి బూతుపురాణం అందుకున్న బండ్ల మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ప్రతీ సారీ పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలకి బండ్ల గణేష్ స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్. పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ బండ్ల వాడే ప్రాస పంచులు ఫ్యాన్స్ ని అలరిస్తాయి. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బండ్ల గణేష్ కి పిలుపు రాలేదు. దిని వెనుక త్రివిక్రమ్ ఉన్నారట. ఓ అభిమానితో ఫోన్ లో మాట్లాడిన బండ్ల ..ఈ సంగతి చెప్పారు. అంతేకాదు త్రివిక్రమ్ ని ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందని తెలుసుకునేలోగా మరో వార్త ఇండస్ట్రీలో కార్చిర్చులా వ్యాపించింది.

Latest Videos

అదేమింటే....ఆడియో ఈ విషమయై పవన్ చాలా ఫైర్ అయ్యారట. తన మిత్రుడు త్రివిక్రమ్ ని ఇలా అనటం తో చాలా కోపం వచ్చిందిట.  ఇక నుంచి పవన్ కల్యాణ్ క్యాంప్ కు బండ్ల కు నో ఎంట్రీ బోర్డ్ పెట్టారట. ఇప్పటికే బండ్ల గణేష్ కు సినిమా లేదు. ఎప్పుడో   2015 లో ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా చేసాడు. ఇప్పటిదాకా మరో సినిమా లేదు. ఈ నేపధ్యంలో పవన్ తో సినిమా ఉంటుందనుకుంటే  ఈ ఆడియో ట్విస్ట్ పడిందంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇక ఈ ఆడియోలో ''అజ్ఞాతవాసి లాంటి చెత్త సినిమా తీశాడు. భీమ్లా నాయక్ తేడా వస్తే త్రివిక్రమ్ ఇంటికెళ్ళి కొడత. వైసీపీ వాళ్లతో కుమ్మక్కై .. నన్ను వేడుకకి రాకుండా సైడ్ చేశాడు త్రివిక్రమ్'' ఇలా సాగింది బండ్ల గణేష్ ఆడియో సంభాషణ. ఈ ఫోన్ కాల్ ఎలా లీక్ అయ్యిందో తెలీదు కానీ ఇది ఫేక్ కాల్ అని చెప్పడానికి లేదు. ఇందులో మాట్లడుతోంది స్పష్టంగా బండ్ల గణేష్ అని తెల్చేసారు.  మరి ఈ విషయమై బండ్ల కామెంట్ ఏమిటో చూడాలి.

click me!