ఈ వార్తలు గోపిచంద్ మలినేని దాకా చేరాయట. ఆయన షాక్ అయ్యారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టింది.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా నిన్నటి (ఫిబ్రవరి 18వ తేదీ) నుండి ప్రారంభం అయింది. తెలంగాణా సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గోపీచంద్ మలినేని క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. అలాగే బాలయ్య అఖండ తర్వాత చేస్తున్న చిత్రం కాబట్టి ఖచ్చితంగా క్రేజీ కాంబోనే అని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఫొటో బయిటకు లీక్ అయ్యి...ఈ సినిమా పై రీమేక్ ముద్ర వేస్తోంది.
వివరాల్లోకి వెళితే...ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ ఇంటర్నెట్‌లో లీకైంది. బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తుండటం, అదే సమయంలో లుక్ మంచి మాస్‌గా ఉండటంతో నందమూరి అభిమానులు ఈ లుక్ చూసి పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ లుక్ చూశాక సినిమా స్టోరీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కన్నడ సినిమా ‘మఫ్టీ’లో శివరాజ్ కుమార్, ఆ సినిమాకు తమిళ రీమేక్ ‘పత్తు తల’లో శింబు లుక్ తరహాలో బాలయ్య లుక్ ఉంది. దీంతో ఈ సినిమా రీమేక్ అని కొంతమంది అంటున్నారు. ఈ వార్తలు గోపిచంద్ మలినేని దాకా చేరాయట. ఆయన షాక్ అయ్యారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టింది.
ఇక బాలయ్య కోసం పవర్‌ఫుల్ కథని సిద్ధం చేసినట్లు దర్శకుడు గోపిచంద్ మలినేని చాలా సందర్భాల్లో చెప్పారు. మరి కొత్త కథ రాశారా, మఫ్టీనే తెలుగుకు తగ్గట్లు మార్చారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా మఫ్టీకి రీమేక్ అయితే ఇందులో మరో యువ హీరోకు కూడా స్కోప్ ఉంటుంది.ఈ పాత్రను కన్నడంలో ఉగ్రం ఫేమ్ శ్రీమురళి చేశారు. ప్రస్తుతం తమిళంలో కడలి ఫేమ్ గౌతమ్ కార్తీక్ చేస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో మీనా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా యొక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో మీనా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమా యొక్క ప్రధాన హైలైట్‌గా ఉంటుందని సమాచారం. బాలకృష్ణ, మీనా ఇద్దరూ ఇంతకుముందు ముదుల మొగుడు, బొబ్బిలి సింహం వంటి చిత్రాల్లో కలిసి నటించారు.