తమ రిక్వెస్ట్ ని మన్నించి ప్రీరిలీజ్ వేడుకకు వస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్‌కు నిర్మాత నాగవంశీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రీరిలీజ్ వేడుకకు కేటీఆర్ హాజరవుతుండటంతో ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘భీమ్లా నాయక్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రావటానికి రంగం సిద్దమైంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర టీమ్ ముమ్మరం చేసింది. ఫిబ్రవరి 21న ప్రీరిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) హాజరు అవుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది.
తమ రిక్వెస్ట్ ని మన్నించి ప్రీరిలీజ్ వేడుకకు వస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్‌కు నిర్మాత నాగవంశీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రీరిలీజ్ వేడుకకు కేటీఆర్ హాజరవుతుండటంతో ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే అదే సమయంలో ఇది జగన్ కు ఇండైరక్ట్ కౌంటర్ ఎటాక్ అనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
కేటీఆర్ ని పిలవటం ద్వారా పవన్ కళ్యాణ్ ఓ వ్యూహాత్మక మార్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. రాజకీయాలు, సినిమా వేరు వేరు అని చెప్పటమే ఇక్కడ తన ఉద్దేశ్యంగా ఆంధ్రా గవర్నమెంట్ కు సందేశం పంపాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే కేటీఆర్ కు ప్రయారిటీ ఇచ్చి ప్రి రిలీజ్ పంక్షన్ కు పిలిచారో అప్పుడే ఆంధ్ర సీఎంకు మీ లెక్క లేదనే విషయం చెప్పినట్లు అవుతుందని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. అదే పవన్ కళ్యాణ్...ఈ ప్రీ రిలీజ్ పంక్షన్ ని వైజాగ్ లో జరిపితే జగన్ ని అతిధిగా పిలుస్తారా...పిలవరు కదా అంటున్నారు. అలాగే ఇక ఈ స్టేజీపై పవన్ ఏం మాట్లాడబోతున్నారు. ఏ విధమైన ఇండైరక్ట్ సెటైర్స్ వేస్తారు అనేది తెలియాల్సి ఉంది.
పవన్ భీమ్లానాయక్ రిలీజ్ కు రంగం సిద్దమైంది. ఈ చిత్రం రాకతో మిగతా సినిమాలన్నీ బరిలోనుంచి తప్పుకున్నాయి. ఇంతకుముందు భీమ్లానాయక్ తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు, గని సినిమాలు షెడ్యూల్ చేసారు. ఎప్పుడైతే భీమ్లానాయక్ ను ఫిబ్రవరి 25న తీసుకొస్తామని ప్రకటించారో, ఆ వెంటనే గని సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా వాయిదా వేశారు.
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ను తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.