#Rajamouli:రాజమౌళితో 'నెట్ ఫ్లిక్స్' భారీ స్కెచ్, కళ్లు తిరిగే ప్లానింగ్

By Surya Prakash  |  First Published Sep 13, 2022, 10:25 AM IST

ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ దిగకముందే రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏమిటంటూ జోరుగా చర్చ నడుస్తోంది. మామూలుగా అయితే రాజమౌళి సినిమా సినిమాకు భారీగా గ్యాప్ తీసుకుంటారు. కానీ ఈసారి త్వరగానే తర్వాతి సినిమాను పట్టాలపైకి ఎక్కిస్తారని టాక్ నడుస్తోంది. 


గత కొంతకాలంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిగతా సంస్థలతో పోటీ పడలేకపోతున్న సంగతి తెలిసిందే. దాంతో  రోజురోజుకు ఈ సంస్థ గ్రాఫ్ తగ్గిపోతుంది. ఆసియా దేశాల కంటే యూరప్ దేశాల్లో నెట్ ప్లిక్స్ సబ్ స్క్రైబర్స్ భారీగా తగ్గిపోతున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఇది మిగతా ఓటిటి సంస్దలకు పోటీ ఇవ్వలేకపోతోంది.  ఇదిలాగే కొనసాగితే మరింత మంది స్క్రైబర్స్ తగ్గే ప్రమాదం ఉందని లెక్కలు తేలుస్తున్నాయి. అయితే భారత్, ఆసియా దేశాల్లో ఉన్నంతలో మెరుగు. ఈ మేరకు సంస్థ సీఈవో రీడ్ హాస్టింగ్స్ సైతం స్క్రైబర్స్ తగ్గడాన్ని ఒప్పేసుకున్నారు. దీంతో ముందు ముందు ఈ సంస్థ పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో భారత్ లో, మిగిలిన ఆసియా దేశాల్లో తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు నెట్ ప్లిక్స్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా రాజమౌళి వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి నెట్ ప్లిక్స్ వారు..రాజమౌళి ని కలిసి ఇప్పటికే ఓ ప్రాజెక్టు నిమిత్తం చర్చించారని సమాచారం. అది భారీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని వినికిడి. ఈ సీరిస్ తో నెట్ ప్లిక్స్ ఒక్కసారిగా తమ సత్తా ఓటిటిలో చూపాలని భావిస్తోంది. ఆర్.ఆర్ .ఆర్ చిత్రం స్ట్రీమింగ్ వరల్డ్ వైడ్ గా నెట్ ప్లిక్స్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో నెట్ ప్లిక్స్ అంటే రాజమౌళి అన్నట్లుగా మార్కెట్ చేయాలని ప్లాన్ చేసారని సమాచారం.

Latest Videos

అయితే రాజమౌళి దృష్టి మొత్తం సినిమాలపై ఉందని, వెబ్ సీరిస్ అంటే చాలా సమయం తీసుకుంటుందని..ఆలోచించి డెసిషన్ తీసుకుంటానని చెప్పారట. అయితే రాజమౌళి ఊహించని మొత్తాన్ని నెట్ ప్లిక్స్ వారు ఆఫర్ చేసారని తెలుస్తోంది. మరో ప్రక్క రాజమౌళి తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉంటుందని ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ దాని తర్వాత ఏ అప్ డేట్ కూడా లేదు. రాజమౌళి తర్వాతి ప్రాజెక్టుపై ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ అప్ డేట్ ఇచ్చారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మహేశ్-జక్కన్న సినిమా వివరాలు వెల్లడించారు. 

రాజమౌళి మహేశ్ తో తీసే సినిమా చాలా అడ్వెంచరస్ గా ఉటుందని… ఇప్పటి వరకు ఎవరూ చూడని కొత్త కథ అని చెప్పారు విజయేంద్రప్రసాద్. దాంతో పాటు ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. ఆ సినిమా కథ స్క్రిప్టు వర్క్ జరుగుతోంది… మెయిన్ గా అడవిని బేస్ చేసుకుని ఉంటుందని అన్నారు. షూటింగ్ కూడా అడవుల్లోనే తీయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ సినిమా మహేశ్ కు మర్చిపోలేని చిత్రం అవుతుందని చెప్పారు.

click me!