తమ కన్నడ హీరోతో సూపర్ హిట్ కొట్టి ఇక్కడ కంటిన్యూ కాకుండా తమ దర్శకులు తెలుగు హీరోలు చుట్టూ కథలు పట్టుకుని తిరుగుతున్నారని తిట్టిపోస్తున్నారు. తమ కన్నడ హీరోలతో నెక్ట్స్ సినిమాలు చేస్తే తమ కన్నడ పరిశ్రమ బాగుంటుంది కదా అంటున్నారు.
తమ భాషలో హిట్ కొట్టి వేరే భాషా హీరోలను డైరక్ట్ చేద్దామనుకునే వాళ్లు అన్ని చోట్లా ఉంటారు. మనకు ఎక్కువగా తమిళం నుంచి తెలుగులోకి వస్తూంటారు. అక్కడ ఓ విజయం సాధించగానే తెలుగు హీరోకు కథ చెప్పి ఒప్పించాలనుకుంటారు. అందుకు కారణం తెలుగు మార్కెట్ పెద్దది కావటం..ఇక్కడ రెమ్యునరేషన్స్ , సినిమా బడ్జెట్ లు బాగుండటం. అయితే ఇప్పుడు కన్నడ దర్శకులు కూడా మనవైపు చూస్తున్నారు.
కేజీఎఫ్ సూపర్ హిట్ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇక్కడ ప్రభాస్, ఎన్టీఆర్ లతో ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. తర్వాత రామ్ చరణ్ తో కూడా ఉంటుందంటున్నారు. ఈ లోగా మరో కన్నడ దర్శకుడుకి రామ్ చరణ్ డేట్స్ ఇచ్చినట్లు వినపడుతోంది. ఇది కన్నడ వారికి బాధ కలిగిస్తోంది.
తమ కన్నడ హీరోతో సూపర్ హిట్ కొట్టి ఇక్కడ కంటిన్యూ కాకుండా తమ దర్శకులు తెలుగు హీరోలు చుట్టూ కథలు పట్టుకుని తిరుగుతున్నారని తిట్టిపోస్తున్నారు. తమ కన్నడ హీరోలతో నెక్ట్స్ సినిమాలు చేస్తే తమ కన్నడ పరిశ్రమ బాగుంటుంది కదా అంటున్నారు. అలాగే తెలుగు హీరోలు కూడా వీరిని ఎంకరేజ్ చేస్తున్నారని వాపోతున్నారు.అదే రాజమౌళి అంత పెద్ద హిట్స్ వచ్చినా తెలుగు హీరోలను వదలటం లేదని, హిందీ నుంచి ఆఫర్స్ వచ్చినా వెళ్లటం లేదని తమ దర్శకులు అలా ఆలోచించటం లేదని విమర్శిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తూ కొందరు పోస్ట్ లు పెడుతున్నారు.
కన్నడ హీరో శివరాజ్ కుమార్ 'మఫ్టీ' అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశారు. ఆ చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించింది . ఈ చిత్ర దర్శకుడు నర్తన్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం స్టోరీ లైన్ ఇప్పటికే రామ్ చరణ్ విన్నట్లు ప్రచారం జరుగటమే అందుకు కారణం.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే జెర్సీ డైరక్టర్ గౌతం తిన్ననూరితో చరణ్ సినిమా ఉండాల్సి ఉంది.కానీ సెకండాఫ్ సెట్ కాక చరణ్ ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్ోతంది.
ఈ క్రమంలో రామ్ చరణ్ 16వ సినిమా కన్నడ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.తొలి సినిమాతోనే కన్నడలో సూపర్ హిట్ కొట్టిన నర్తన్ డైరక్షన్ లో చరణ్ 16వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. నర్తన్ గతంలో ప్రశాంత్ నీల్ దగ్గర పనిచేసారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన మఫ్టీ సినిమా అతనికి అది మొదటి ప్రయత్నమే. అయినా సరే తొలి సినిమా దర్శకుడిగా కాకుండా ఎంతో అనుభవం ఉన్న వాడిగా సినిమా తీసి హిట్ అందుకున్నాడు. తెలుగులోనూ చరణ్ తో సెట్ అయ్యి హిట్ కొడితే అతను తెలుగులోనూ పెద్ద దర్శకుడు అవుతాడనటంలో సందేహం లేదు.