Acharya: ‘ఆచార్య’కు ఇది లాటరీనే, 18 కోట్ల ఊహించని ఎగస్ట్రా ఆదాయం?

By Surya Prakash  |  First Published May 5, 2022, 6:07 AM IST

ఈ సినిమాకు 18 కోట్ల అదనపు ఆదాయం దొరికే అవకాసం వచ్చింది. ఇంత డిజాస్టర్ టాక్ వచ్చాక ఇంకా  ఇంకా  ఈ అదనపు ఆదాయం ఏంటి అనిపిస్తోందా? అదేంటో చూడండి. 



ఈ మధ్య కాలంలో ఎక్కువ నెగిటివ్ టాక్ తెచ్చుకున్న  పెద్ద చిత్రాలు రెండు. అందులో ఒకటి రాధే శ్యామ్ కాగా మరొకటి  ‘ఆచార్య’. ఈ సినిమా రిలీజ్ కు ముందు టీమ్ ప్రమోషన్ కన్నా ..రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా డిజాస్టర్ అనే ప్రమోషన్ ఎక్కువైపోయింది.  దాంతో ఈ సినిమా ఏ దశలోనూ కోలుకోలేని సిట్యువేషన్ కు చేరుకుంది. అయితే అదే సమయంలో ఈ సినిమాకు కొద్ది గొప్పో ఒడ్డున పడే అవకాసం వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 18 కోట్ల అదనపు ఆదాయం దొరికే అవకాసం వచ్చింది. ఇంత డిజాస్టర్ టాక్ వచ్చాక ఇంకా  ఇంకా  ఈ అదనపు ఆదాయం ఏంటి అనిపిస్తోందా? అదేంటో చూడండి. 

‘ఆచార్య’ చిత్రం రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్ పూర్తి చేసుకుంది. అమేజాన్ ప్రైమ్ వాళ్లు మంచి రేటుకే సినిమాను కొన్నారు. విడుదల తర్వాత నాలుగు వారాలకు ప్రైమ్‌లో డిజిటల్ రిలీజ్ చేయాలన్నది ముందు జరిగిన ఎగ్రిమెంట్. అయితే చిరు చివరి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’కి ప్రైమ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ రావడం, అలాగే చరణ్ సినిమా ‘రంగస్థలం’ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకోవడం.. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో మంచి ఊపులో ఉండటంతో ఈ చిత్రానికి భారీ రేటే పెట్టింది  ప్రైమ్ . అయితే  ఈ చిత్రం భారీ స్దాయిలో థియేటర్లలో డిజాస్టర్ అయింది.  ఎంతలా అంటే వారం తిరిగేసరికి థియేట్రికల్ రన్ ముగిసిపోయేటట్లంది.  ఈ వీకెండ్లో కూడా కష్టమే అంటున్నారు.

Latest Videos

ఈ నేపధ్యంలో  ‘ఆచార్య’డిజిటల్ రిలీజ్ కోసం అనుకున్న టైమ్ కన్నా ముందే చేసేస్తే బెస్ట్ అనే నిర్ణయానికి ప్రైమ్ వచ్చింది. ఇంకో మూడు వారాలు ఆగాల్సిన పని లేదని డిసైడ్ అయ్యారట. కానీ అందుకు ఆచార్య నిర్మాతకు కలిసివచ్చేదేముంది...అందుకే అమేజాన్ ప్రైమ్ వాళ్లతో మాట్లాడి డీల్ రివైజ్ చేసినట్లు తెలుస్తోంది.   వారం ముందుగానే.. అంటే రిలీజైన మూడు వారాలకు సినిమాను ప్రైమ్‌లో రిలీజ్ చేసేయబోతున్నట్లు సమాచారం.  ఇలా ముందుగానే రిలీజ్ కు ఒప్పుకున్నందుకు ‘ఆచార్య’ నిర్మాతలకు రూ.18 కోట్లు ఇవ్వబోతోంది ప్రైమ్.గతంలో కొన్ని హిందీ సినిమాలకు ఇలా చేసింది  ప్రైమ్ . దాంతో  ఆ పాలసీ ప్రకారం ఇలా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఏదైమైనా కొద్దిలో కొద్ది నష్టం  భర్తీ చేసుకున్నట్లే కదా.

click me!