SVP: అమెరికా డిస్ట్రిబ్యూటర్ కు పెద్ద ఛాలెంజ్, మహేష్ బాషలో దూల తీరిపోతోంది

By Surya Prakash  |  First Published May 3, 2022, 5:58 AM IST

గతంలో ఇదే డిస్ట్రిబ్యూటర్ జాతిరత్నాలు చిత్రాన్ని యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేసారు. ఇప్పుడు శ్లోక ఎంటర్టైన్మెంట్ తో కలిసి యుఎస్ థియోటర్ రైట్స్ సర్కారు వారి పాట చిత్రాన్ని తీసుకున్నారు. 



మహేష్ బాబు: ఏమయ్యా కిశోర్ మనకేమైనా మేరేజ్ చేసుకునే వయసొచ్చిందంటావా?
వెన్నెల కిషోర్: ఊరుకోండి సార్! మీకు అప్పుడే పెళ్లేంటి. చిన్నపిల్లాడు ఐతేనూ!
మహేష్ బాబు: అందరూ నీలాగే అనుకుంటున్నారయ్యా… దీనమ్మా మైంటైన్ చెయ్యలేక దూల తీరిపోతోంది.
ఇది సర్కారు వారి పాట సినిమాలో డైలాగు. దాదాపు ఇదే పరిస్దితి యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎదురౌతుంది అంటున్నారు. ఎందుకంటే ఎంతో రేటు పెట్టి కొన్న ఈ సినిమాకు పోటీ కూడా అదే స్దాయిలో ఉంటుంది. అందరూ సర్కారు వాటి పాట సినిమా రైట్స్ తీసుకున్నారంటే అసూయతో చూస్తారు. కానీ లాభాలు వచ్చేదాకా ఓ ప్రక్కన డాక్టర్ స్ట్రేంజ్ ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలంటే చాలా కష్టమైన వ్యవహారం.

మహేశ్‌బాబు ఇంతుకు  మునుపెన్నడూ కనిపించిన లుక్‌లో అలరించబోతున్నాడని క్లారిటీ నిన్నటితో పూర్తిగా వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వారిలో ‘సర్కారు వారి పాట’పై ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మహేష్ క్లాస్‌ అండ్‌ మాస్‌ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉన్నాయి. ట్రైలర్ లో చూపించిన సీన్స్ ని బట్టి యాక్షన్‌, కామెడీ, లవ్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజిలో జరిగిందో..జరగబోతోందో చెప్పక్కర్లేదు. అలాగే ఈ చిత్రం యుఎస్ లోనూ భారీ రేట్లకే సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Latest Videos

FlyHigh Cinemas  వారు ఈ సినిమా యుఎస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. గతంలో ఇదే డిస్ట్రిబ్యూటర్ జాతిరత్నాలు చిత్రాన్ని యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేసారు. ఇప్పుడు శ్లోక ఎంటర్టైన్మెంట్ తో కలిసి యుఎస్ థియోటర్ రైట్స్ సర్కారు వారి పాట చిత్రాన్ని తీసుకున్నారు. ఈ సినిమాకు ఇప్పుడు మాగ్జిమమ్ షో లు పడితేనే తీసుకున్న రేటు రికవరీ అవుతుందని అంచనా. అయితే ఇదే పెద్ద ఛాలెంజ్ గా మారనుంది. అలాగే షో టైమింగ్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.  ఎందుకంటే హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ ఖచ్చితంగా రెండో వారం చాలా థియోటర్స్ ఆక్యుపై చేస్తుందని అంచనా వేస్తున్నారు.

మహేష్ నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మార్వెల్ “డాక్టర్ స్ట్రేంజ్: మ్యాడ్‌నెస్ ఆఫ్ ది మల్టీవర్స్” తెరపైకి వస్తోంది. హాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “డాక్టర్ స్ట్రేంజ్” ఒకటి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన స్పందన వస్తుందనడంలో అలన్తి సందేహం లేదు. దాదాపు ఇండియాలో కూడా ఈ మూవీ గురించి సూపర్ హీరో మూవీని ఇష్టపడే ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మే 6న దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో విడుదల కానుంది.

సినిమా ప్రేక్షకులను మెప్పించిందంటే ఇక్కడి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా “డాక్టర్ స్ట్రేంజ్” సునామీని సృష్టిస్తాడు. ఆ తరువాత వారం కూడా గ్యాప్ లేకుండానే మహేష్ థియేటర్లలో సందడి చేయనున్నారు. దాంతో “సర్కారు వారి పాట”పై “డాక్టర్ స్ట్రేంజ్” ప్రభావం తప్పకుండా కొంతైనా పడుతుందని భావిస్తోంది ట్రేడ్. 2018లో మహేష్ “భరత్ అనే నేను”, మార్వెల్ స్టూడియోస్ “అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్” దాదాపు అదే సమయంలో తెరపైకి వచ్చాయి. ఫలితంగా “భరత్ అనే నేను” మూవీ USA బాక్సాఫీస్ వద్ద భారీ సంఖ్యలో వసూలు చేయడంలో విఫలమైంది. 2019లో మహేష్ “మహర్షి” చిత్రానికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. “మహర్షి” విడుదలైన సమయంలోనే “ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్” కూడా విడుదలైంది.   
 
బ్యాంకు కుంభకోణం తదితర అంశాలతో యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమాని పరశురామ్‌ తెరకెక్కించారు. మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటించింది. వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌, ఛాయాగ్రహణం: ఆర్‌. మధి. 

click me!