NTR: ‘ ఆచార్య ‘ నష్ట పరిహారం, సెటిల్మెంట్...ఎన్టీఆర్ హామీతో ?

By Surya Prakash  |  First Published May 4, 2022, 6:40 AM IST

 సినిమా ప్రొడక్షన్ లో ,బిజినెస్ లో  పాలుపంచుకునే అతి కొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇదే ఇప్పుడు అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేసిందంటున్నారు. 


గత నెల 29న రిలీజైన ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకోలేకపోవటంతో మార్నింగ్ షో నుంచే ఫ్లాఫ్ దిసగా ప్రయాణం పెట్టుకుంది. మొదటి సారి చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజైనా.. ఆ ఎక్సపెక్టేషన్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఆ ప్రభావం సినిమా బాక్సాఫీస్‌ కలెక్షన్లపై పడింది. తొలి రోజే అంతంతమాత్రం వసూళ్లు సాధించగా.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ట్రేడ్‌ అనలిస్టుల అంచనా ప్రకారం..టాలీవుడ్‌ చరిత్రలో అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచిపోయేటట్లుంది ఆచార్య. ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పవని వాళ్లు తేల్చేశారు.  మరి ఆ నష్టాలు ఎవరు భరిస్తారు. భారీ రేట్లు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కు సెటిల్మెంట్ ఎవరు చేస్తారు?

వాస్తవానికి ఈ సినిమా ఎఫెక్ట్ కొరటాల పైనే ఎక్కువ పడుతోంది. సినిమా ప్రొడక్షన్ లో ,బిజినెస్ లో  పాలుపంచుకునే అతి కొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇదే ఇప్పుడు అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేసిందంటున్నారు. అంతే కాదు ఇది జూనియర్ ఎన్టీఆర్‌కి తలనొప్పిగా మారింది. కొరటాల శివ , ఆయన ప్రెండ్స్  ఆచార్య  బిజినెస్ ను చూసుకున్నారు. ఇదే టీమ్ ఎన్టీఆర్ 30కి పని చేయబోతోంది. ఎన్టీఆర్ 30 ప్రొడక్షన్ వారు చూసుకుంటారు. అయితే, ఇక్కడ సమస్య వస్తోంది. అది ఏమిటంటే, ఆచార్య దాదాపు రూ. 70 కోట్లకు పైగా నష్టం అని అంచనా.

Latest Videos

మరో ముఖ్యంగా నైజాంలో కాక‌లు తీరిన పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను కాద‌ని మ‌రీ పోటీకి వెళ్లి వ‌రంగ‌ల్ శ్రీను ఆచార్య రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రైట్స్ ప‌బ్లిసిటీతో క‌లుపుకుని మొత్తం రు. 42 కోట్ల‌కు వ‌రంగ‌ల్ శ్రీను సొంతం చేసుకున్నాడు. మ‌న‌కు వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం 50 శాతం న‌ష్టాలు అంటే రు. 21 కోట్ల‌కు పైగానే శ్రీను న‌ష్ట‌పోతాడ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ మొత్తం ఖ‌ర్చు పెట్టేసి ఉండడంతో వ‌రంగ‌ల్ శ్రీను బాగా కుదేలైపోయాడు.ఆచార్యపై భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు త్వరలో శివతో మీటింగ్ అయ్యి, పరిహారం గురించి చర్చించనున్నారు. కొరటాల శివ ఖచ్చితంగా.. ఆచార్య డిస్ట్రిబ్యూటర్లకు కొంతమేర నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.

అంతేకాదు  ఎన్టీఆర్ 30 థియేట్రికల్ రైట్స్ తగ్గింపు ధరకు ఇస్తామని హామీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఇది కొత్త విషయం కాదు. గతంలోనూ తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫైతే తమ నెక్ట్స్ సినిమాల బిజినెస్‌ని అడ్జస్ట్ చేసుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. దానికి తోడు ఎన్టీఆర్ , కొరటాల శివ చాలా మంచి స్నేహితులు . దాంతో ఎన్టీఆర్ కూడా ఈ సమస్యని పరిష్కరిద్దామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే, రామ్ చరణ్‌తో తారక్ రిలేషన్ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలి.  అయితే ఇందులో అతి పెద్ద సమస్య ఏమిటంటే ఆచార్య ఎగ్రిమెంట్స్ .

 సగటున, 10 కోట్లకు తీసుకున్న వారు 8-8.5 కోట్ల వరకు నష్టపోతున్నారు. ఏదో చిన్న మొత్తం అయితే ఆ లెక్క వేరు. దాంతో ఎన్టీఆర్ 30 షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఇది కూడా పరిష్కరించబడాలి. ఆచార్య  బాక్సాఫీస్ వద్ద కోలుకునే అవకాశాలు లేవని తేలిపోయింది. దాంతో అదంతా వచ్చి ఎన్టీఆర్ 30పై పడుతుంది. అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా పెద్ద హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రెజర్ కూడా కొరటాల ఆయన టీమ్ పై ఉంటుంది.

click me!