
యంగ్ హీరో శర్వానంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత ఆయనకు మరలా విజయం అందలేదు. రీసెంట్ గా వచ్చిన ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు.రష్మిక మందన్నతో కలిసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను క్యూరియాసిటీని పెంచేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(మార్చి 4)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’చిత్రం అనుకున్న స్దాయిలో మాత్రం ప్రేక్షకులును అలరించలేదు.
‘‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కు ఓపినింగ్స్ సరిగ్గా దక్కలేదు. డల్ నోట్ తో ప్రారంభమైన ఈ సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రమే అన్నట్లున్నాయి. అమెరికాలో ప్రీమియర్స్ నుంచి $55K,శుక్రవారం $68K కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తం మీద అక్కడ కేవలం $124K మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ ఓపినింగ్స్ గా నిలిచింది. ఇక్కడ ఇండియాలో మొదటి రోజు కేవలం 1.3 కోట్ల షేర్ వసూలు చేసి షాక్ ఇచ్చింది. శనివారం ఆక్యుపెన్సీ కూడా అంతంత మాత్రమే. ఇదే విధంగా ఈ రోజు ఆదివారం కూడా ఉంటే వాష్ అవుట్ ఫిల్మ్ క్రింద లెక్కేస్తారు.
ఇది శర్వాకు ఆరవ వరస ప్లాఫ్. శర్వాకు ఇప్పుడు హిట్ అత్యవసరమైన టైమ్. ఎక్కడ తన అంచనాలు తప్పుతున్నాయో చెక్ చేసుకోవాల్సిన టైమ్. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోకపోవటమే సినిమా ప్లాఫ్ లకు కారణం అంటున్నారు విశ్లేషకులు అది గమనించుకోవాలి.గత సినిమాలన్నిటిలోనూ ఒకటే లుక్, మ్యానరిజంలతో నెట్టుకొస్తున్నారు. బరువు కూడా పెరిగారు. తన బాడీపై,బాడీలాంగ్వేజ్ పై, స్టైలింగ్ పై దృష్టి పెట్టారు. లేకపోతే ఈ జనరేషన్ యూత్ ని ఆకట్టుకోవటం కష్టం.
‘‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాని నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా చూసి, బాగుందన్నారు. మా సినిమా చూసినవారిలో ఒక్కరు కూడా బాగోలేదని అనడం నేను వినలేదు’’ అని శర్వానంద్ అన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలయింది.