#Balakrishna: సంక్రాంతి వద్దు 'అఖండ' సెంటిమెంటే ముద్దు

By Surya Prakash  |  First Published Sep 14, 2022, 4:56 PM IST


బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.  



సినిమావాళ్లు సెంటిమెంట్స్ కు ఎంత ప్రయారిటీ ఇస్తూంటారో మనకు తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య వంటి స్టార్ హీరో ఎక్కువ సెంటిమెంట్స్ చూసుకుని ముందుకు వెళ్తారని చెప్తూంటారు. ఇప్పుడు అదే విధంగా తన తాజా చిత్రం రిలీజ్ కు కూడా సెంటిమెంట్ నే నమ్ముకోబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ నటిస్తున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.  

Latest Videos

ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నారట. అఖండ రిలీజ్ రోజైన  డిసెంబర్  2  వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ చేసిన 'అఖండ' డిసెంబర్ 2వ తేదీన విడుదలై, సంక్రాంతికి కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ అలాగే ఈ సినిమా కూడా సంక్రాంతి దాకా ఆడుతుందని నమ్ముతున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన ఏదీ ఇంకా రాలేదు.

 బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘అఖండ‌’. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రం వారి కాంబోకి హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలిచింది. సాధార‌ణ ప‌రిస్థితుల్లో హిట్ అయితే ఓకే అనుకునేవారేమో కానీ.. కోవిడ్ వంటి క‌ఠిన ప‌రిస్థితుల‌ను ఓ వైపు.. ఏపీలో త‌గ్గించిన టికెట్ ధ‌ర‌ల స‌మ‌స్య మ‌రో వైపు.. ఇలాంటి సిట్యువేష‌న్స్ న‌డుమ విడుద‌లైన ‘అఖండ’ ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.   ‘అఖండ’ ఏకంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. 103 సెంట‌ర్స్‌లో అఖండ 50 రోజులను పూర్తి చేసుకోవ‌డం ఎంటైర్ యూనిట్ చాలా సంతోషంగా ఉంది.

 ఈ సినిమా వ‌సూళ్లోనూ ప్ర‌భంజ‌నం సృష్టించింది. రూ.200 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకోవ‌డం విశేషం. 103 సెంటర్స్‌లో షిఫ్టింగ్ సిస్ట‌మ్‌తో క‌లిసి ‘అఖండ’ 50 డేస్ మార్క్‌ను ట‌చ్ చేసింది.  50 రోజుల సెంట‌ర్ల విష‌యంలో రికార్డు క్రియేట్ చేసిన అఖండ అదే జోరుతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 100 రోజుల వైపు కూడా స్పీడ్‌గానే ప‌రుగులు పెట్టింది. మొత్తం నాలుగు కేంద్రాల్లో డైరెక్టుగా 100 రోజులు ఆడ‌గా… షిఫ్టుల‌తో క‌లుపుకుని మొత్తం 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

click me!