Gardening Tips: మొక్కలకు ఈ తొక్కలు వేస్తే ఎంత ఫాస్ట్ గా పెరుగుతాయో తెలుసా?

Published : Apr 10, 2026, 02:20 PM IST
Orange peels

సారాంశం

సాధారణంగా నారింజ తొక్కలను అందరూ పడేస్తుంటారు. కానీ వాటి ఉపయోగాలు తెలిస్తే మాత్రం.. ఇంకెప్పుడు ఆ పని చేయరు. బాల్కనీలో పెంచుతున్న మొక్కలకు నారింజ తొక్కలను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవెంటో ఇక్కడ తెలుసుకోండి. 

Orange Peel Fertilizer for Plants: ప్రస్తుత రోజుల్లో బాల్కనీ గార్డెనింగ్ చాలామందికి అలవాటుగా మారింది. అయితే, మొక్కల సంరక్షణకు సహజమైన, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులు వెతకడం కూడా ముఖ్యమే. ఈ విషయంలో, మనం రోజూ తిని పడేసే నారింజ తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు మొక్కల పెరుగుదలకు సాయపడటమే కాకుండా, వాటిని పురుగుల నుంచి కూడా కాపాడతాయి. వీటిని ఎలా ఉపయోగించాలో మూడు సులభమైన పద్ధతులు ఇప్పుడు చూద్దాం.

సహజ ఎరువుగా వాడొచ్చు

నారింజ తొక్కలలో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. ఈ తొక్కలను ఎండబెట్టి, పొడి చేసి మట్టిలో కలపాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకు నెమ్మదిగా పోషకాలు అందుతాయి, వాటి వేర్లు బలంగా తయారవుతాయి. ఇది పూర్తిగా ఆర్గానిక్ ఎరువు కాబట్టి మొక్కలకు ఎలాంటి హాని జరగదు.

పురుగులను తరిమికొట్టేందుకు నేచురల్ స్ప్రే

నారింజ తొక్కల నుంచి వచ్చే ఘాటైన వాసన చాలా రకాల హానికరమైన పురుగులను దూరం చేస్తుంది. ఈ స్ప్రే చేయడానికి, తొక్కలను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత, ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ ద్రావణాన్ని మొక్కల ఆకులపై స్ప్రే చేస్తే పురుగులు దరిచేరవు. ఇది రసాయనాలు లేని పద్ధతి. ఇది మీ గార్డెన్‌ను ఆరోగ్యంగా ఉంచుతూ, మొక్కలకు రక్షణ కల్పిస్తుంది.

మట్టి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయం

నారింజ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మట్టిలో కలపడం వల్ల దాని నాణ్యత మెరుగుపడుతుంది. ఇవి నెమ్మదిగా మట్టిలో కలిసిపోతూ, దానిని మరింత సారవంతంగా చేస్తాయి. అలాగే, మట్టిలో అవసరమైన పోషకాల శాతాన్ని పెంచుతాయి. అంతేకాకుండా, మట్టిలో తేమను నిలిపి ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయి. దీనివల్ల మీ మొక్కలు ఎక్కువ కాలం తాజాగా, ఆరోగ్యంగా ఉంటాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Money Plant: మ‌నీ ప్లాంట్ ఉంటే ఇంట్లోకి పురుగులు వ‌స్తాయా.? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటే
Camphor Plant: ఈ సింపుల్ చిట్కాలతో కర్పూరం మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!