Bucket Gardening: పాత బకెట్లు పడేస్తున్నారా? ఇలా వాడితే డబ్బు ఆదా.. ఇంటి అందం రెట్టింపు!

Published : Mar 12, 2026, 02:08 PM IST
Bucket Gardening

సారాంశం

మీ ఇంట్లో పాత బకెట్లు ఉన్నాయా? అయితే ఖరీదైన కుండీల కోసం డబ్బులు వృథా చేయాల్సిన అవసరం లేదు. ఈ పాత బకెట్లనే ప్లాంటర్లుగా మార్చుకొని బంతి, చామంతి, కాస్మోస్, జినియా, పెటూనియా వంటి అందమైన పూల మొక్కలను పెంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

Bucket Gardening: ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని చాలామంది ఇష్టపడతారు. బాల్కనీలో, డాబా మీద మొక్కలు పెంచడం సరదాగా కూడా ఉంటుంది. అయితే మొక్కలు పెంచడానికి ఖరీదైన కుండీలు, గ్రో బ్యాగ్‌లు కొనాలంటే బడ్జెట్ సమస్య ఉంటుంది. అలాంటి వాళ్లకి ‘బకెట్ గార్డెనింగ్’ ఒక సూపర్ ఐడియా. ఇంట్లో పాతబడిన ప్లాస్టిక్ లేదా ఇనుప బకెట్లను పడేయకుండా, వాటినే అందమైన ప్లాంటర్లుగా మార్చుకోవచ్చు. నీళ్లు నిలిచిపోకుండా బకెట్ అడుగున 2–3 చిన్న రంధ్రాలు చేసి, మంచి మట్టి నింపి మొక్కలు నాటుకుంటే సరిపోతుంది.

పాత బకెట్లలో పూల మొక్కలు పెంచడం వల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా, బాల్కనీ, డాబా కూడా రంగురంగుల పూలతో కళకళలాడతాయి. బకెట్లలో సులభంగా పెరిగే 5 అందమైన పూల మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కాస్మోస్

కాస్మోస్ మొక్కలు తేలికపాటి మట్టిలో చాలా వేగంగా పెరుగుతాయి. దీని తెలుపు, గులాబీ, ఊదా రంగు పూలతో మీ బాల్కనీ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మొక్కకు ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు, అందుకే బకెట్ గార్డెనింగ్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

జినియా

జినియా రంగురంగుల పూల మొక్క. మంచి ఎండ తగిలితే చాలు, భలేగా పెరుగుతుంది. దీనికి పెద్దగా కేర్ కూడా తీసుకోనక్కర్లేదు. మీ బాల్కనీలో బాగా ఎండ వస్తుంటే, బకెట్‌లో జినియా మొక్కలు పెట్టి ఇంటిని అందంగా మార్చుకోవచ్చు.

పెటూనియా

పెటూనియా పూలు చాలా రంగుల్లో పూస్తాయి, బాల్కనీకి మంచి లుక్ ఇస్తాయి. తేలికపాటి మట్టి, రోజూ కొద్దిగా నీళ్లు పోస్తే చాలు, వేగంగా పెరుగుతుంది. పాత బకెట్‌లో పెటూనియా మొక్కలు పెడితే మీ చిన్న గార్డెన్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది.

బంతిపూలు

బంతి మొక్కను పెంచడం చాలా సులభం. ఇది త్వరగా పూలు కూడా పూస్తుంది. పసుపు, ఆరెంజ్ రంగు బంతిపూలు ఏ బాల్కనీకైనా, డాబాకైనా మంచి కళను తెస్తాయి.

చామంతి

చలికాలంలో ఎక్కువగా పూసే చామంతి మొక్కను కూడా బకెట్‌లో ఈజీగా పెంచవచ్చు. దీని తెలుపు, గులాబీ, పసుపు రంగు పూలు గార్డెన్‌కు చాలా అందాన్నిస్తాయి. కొద్దిగా ఎండ, కాస్త ఎరువు వేస్తే చాలు, గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Okra Farming: ఈ ఒక్క దాంతో ఇంట్లోనే బెండకాయ తోటే వేసేయొచ్చు
Black Pepper: ఇంట్లో నల్ల మిరియాలు ఎలా పెంచాలో తెలుసా?