ఆడవాళ్లు బాస్ అయితే మాత్రం తట్టుకోలేరు.. ఎందుకో తెలుసా?

First Published Apr 17, 2023, 12:43 PM IST

మగ బాస్‌లు మరింత ఉల్లాసంగా , ఇంటరాక్టివ్‌గా ఉంటారని , మహిళా బాస్‌లు ఇతర సహోద్యోగులతో తమ సంబంధాలను అంత ఓపెన్‌గా ఉండనివ్వలేదని పురుషులు ,మహిళలు ఇద్దరూ అంగీకరించడం గమనార్హం.
 

woman boss

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని అందరూ ఉపన్యాసాలు ఇస్తారు. వారు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ.. తీరా వాళ్ల వరకు వచ్చేసరికి... వారి బాస్ మాత్రం ఆడావారు కాకూడదు అనుకుంటారు. ఆడవారు బాస్ అంటే.. తాము ఏదో తక్కువ అని ఫీలైపోతూ ఉంటారు. మగవారు అంటే అనుకోవచ్చు. మహిళలు సైతం తమ బాస్ ఆడవారు అయితే తట్టుకోలేరట.అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దాం..
 

employees mass leave

ప్రతి ఒక్కరూ మహిళా యజమానిని ఇష్టపడరు. మహిళలు తమ మహిళా బాస్‌లను చాలా అరుదుగా ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. 2013 గ్యాలప్ అధ్యయనం ప్రకారం, స్త్రీ, పురుషులు.. బాస్ కోసం తమ ప్రాధాన్యతను చూపించగా, పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు ఈ ప్రాధాన్యతను ప్రదర్శించారు. ఇది పురుషులకు 26 శాతంతో పోల్చితే, పురుష నాయకత్వాన్ని ఇష్టపడే స్త్రీలు 39 శాతం ఉండటం గమనార్హం.

మగ బాస్‌లు మరింత ఉల్లాసంగా , ఇంటరాక్టివ్‌గా ఉంటారని , మహిళా బాస్‌లు ఇతర సహోద్యోగులతో తమ సంబంధాలను అంత ఓపెన్‌గా ఉండనివ్వలేదని పురుషులు ,మహిళలు ఇద్దరూ అంగీకరించడం గమనార్హం.

‘మా బాస్ ఓ స్త్రీ. ఆమె టీమ్ లో నేను ఒక్కదాన్నే అమ్మయి. అయినా ఆమె ప్రతి విషయంలోనూ నాపై చిరాకుపడుతూనే ఉంటుంది. నేను పని బాగా చేస్తాను. ఆమె ముందు నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా కష్టపడతాను. నా బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తాను. కంపెనీ ఎదుగుదల కోసం చాలా ఆలోచిస్తాను. నా ఆలోచనలను ఆమె ఓ లెటర్ ద్వారా అందిస్తే.. కనీసం ఆమె దానిని తెరిచి కూడా చూడలేదు. మా ముందు బాస్..పురుషుడు. ఆయన నా ఆలోచనలను ఎంతగానో ప్రోత్సహించేవారు
 తనకు ఏదైనా నచ్చకపోయినా, నేను నిరుత్సాహపడకుండా మరింత ఆలోచించి ఏం చేయాలో చూడమని ప్రోత్సహించేవాడు. ఈమె మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది’ అని ఓ మహిళా ఉద్యోగి తన బాధను చెప్పడం గమనార్హం.

‘ ఇది నా మొదటి ఉద్యోగం. నేను ఎల్లప్పుడూ వెండి ఆభరణాలతో కూడిన భారతీయ దుస్తులను ధరించడం నాకు అలవాటు. నా లుక్ అలా ఉండటమే నాకు ఇష్టం. అలానే ఆఫీసకు వెళ్లేదాన్ని. కానీ.. మా మహిళా బాస్్.. నన్ను అందరి ముందు తక్కువ చేసేది. ఎగతాళి చేసేది. నా పని కాకుండా.. నా దుస్తులు చూసి జడ్జ్ చేసేది. నా పని చూడకుండానే రిజెక్ట్ చేసేది. 3 నెలల తర్వాత నేను వెస్ట్రన్ దుస్తులను ధరించాను. నా లుక్ మొత్తం మార్చేశాను. అప్పుడు నేను పనిని చాలా చెత్తగా చేసినా... ఆమె మెచ్చుకోవడం మొదలుపెట్టడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నేను మరో పై అధికారి నా పరిస్థితి వివరించారు. వారు నన్ను మరో టీమ్ కి బదిలీ చేశారు. ఇప్పుడు నా కెరీర్ ప్రశాంతంగా ఉంది.’ అని మరో మహిళ చెప్పడం విశేషం. 
 

click me!