ఎండాకాలంలో శానిటరీ ప్యాడ్స్ వద్దు.. కాటర్ ప్యాడ్లే మేలు.. ఎందుకంటే?

First Published | Apr 16, 2023, 11:29 AM IST

ఒకేసారి ఉపయోగించే శానిటరీ ప్యాడ్లను ఎండాకాలంలో ఉపయోగించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెమట ఎక్కువగా పడుతుంది. ఆ ప్రాంతంలో దురద కూడా పెడుతుంది. అందుకే వీటికి బదులుగా.. 
 

శానిటరీ ప్యాడ్స్ అంటే అబ్జార్బెంట్ డిస్పోజబుల్ సింగిల్ యూజ్ ప్రొడక్ట్స్. అంటే వీటిని మనం ఒకేసారి మాత్రమే ఉపయోగించగలం. ప్రస్తుతం చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నాయి. కానీ నేటికీ గ్రామీణ మహిళలు కొంతమంది కాటన్ క్లాత్ నే శానిటరీ ప్యాడ్లుగా ఉపయోగిస్తున్నారు. కానీ చాలా మంది పట్టణ మహిళలు డిస్పోజబుల్ ప్యాడ్లనే ఉపయోగిస్తున్నారు. రీసెర్చ్గేట్ అధ్యయనాల ప్రకారం.. 90 శాతం మంది మహిళలు ప్రతి నెలా డిస్పోజబుల్ ప్యాడ్లను ఉపయోగిస్తున్నారు.  అయితే మళ్లీ ఉపయోగించే ప్యాడ్లను 2 శాతం మంది మహిళలు ఉపయోగిస్తున్నారట. అయితే వేసవిలో ఒకేసారి మాత్రమే ఉపయోగించే శానిటరీ ప్యాడ్లను ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 

మళ్లీ ఉపయోగించే శానిటరీ ప్యాడ్లు పర్యావరణ అనుకూలమైనవి. వీటిని ఉతికి మళ్లీ మళ్లీ ఉపయోగించొచ్చు. అయితే వీటిని ఎక్కువ గంటలు ఉపయోగించకూడదు. 5 నుంచి 6 గంటల మధ్యలో వీటిని మార్చాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసి మళ్లీ వాడుకోవచ్చు. వీటిని వాష్ చేయడానికి కేవలం 5 నిమిషాల సమయమే పడుతుంది. వీటిని తయారు చేయడంలో పర్యవరణానికి ఎలాంటి హాని జరగదు. దీన్ని నాలుగైదేళ్ల పాటు వాడుకోవచ్చు. దీన్ని కడగడం, ఆరబెట్టడం చాలా సులభం. ఈ ప్యాడ్లు మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వాటిని తయారు చేసే చాలా మంది మహిళలకు ఉపాధి మార్గంగా మారుతోంది. ఎండాకాలంలో రీయూజబుల్ ప్యాడ్లను వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


చెమట పట్టదు

ఈ ప్యాడ్స్ పూర్తిగా ఆర్గానిక్ గా ఉంటాయి. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీనివల్ల పీరియడ్స్ ఇంకా ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే కాటన్ ప్యాడ్లను ఉపయోగించడం వల్ల చెమట పట్టే అవకాశం ఉండదు. కాటన్ లేదా పాలిస్టర్ ప్రింటెడ్ దుస్తులతో తయారు చేసిన ఈ ప్యాడ్ల మూలాలు చర్మాన్ని తాకినప్పుడు.. అవి చెమటనను వదిలిస్తాయి. రీసెర్చ్గేట్ ప్రకారం.. ఒక మహిళ తన జీవితకాలంలో సుమారు 15,500 ప్యాడ్లను ఉపయోగిస్తుంది. వీటిలో భూమిని నాశనం చేసే కాలుష్య కారకాలు ఉంటాయి. ఆ ప్యాడ్లు బయోడిగ్రేడ్ కావడానికి కనీసం 500 సంవత్సరాలు పడుతుంది. అందుకే డిస్పోజబుల్ వ్యర్థాల పరిమాణం రోజు రోజుకు పెరుగుతుంది. 

ఇవి శ్వాసించదగినవి

డిస్పోజబుల్ ప్యాడ్లతో పోలిస్తే క్లాత్ ప్యాడ్లు శ్వాసించదగినవి. నిజానికి డిస్పోజబుల్ ప్యాడ్స్ పైన ప్లాస్టిక్ పొర ఉంటుంది. ఇది రోజంతా మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు దురద లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల లేవడానికి, కూర్చోవడానికి, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. డిస్పోజబుల్స్ కంటే క్లాత్ ప్యాడ్లు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. 
 

sanitary

సౌకర్యవంతంగా ఉంటారు

ఇది మన చర్మాన్ని అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంచుతుంది. రక్షిస్తుంది. ఈ ప్యాడ్లు ఏ విధంగానూ జిగటగా ఉండవు. ఇది చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. ఈ ప్యాడ్ల ధర తక్కువగా ఉండటం వల్ల ప్రతి నెలా అయ్యే ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. 

రసాయనాల నుంచి విముక్తి

డిస్పోజబుల్ ప్యాడ్ల తయారీలో ఎక్కువ మొత్తంలో హానిచేసే రసాయనాలను ఉపయోగిస్తారు. ఇది మన చర్మానికి హాని కలిగిస్తుంది. దీని వాడకం వల్ల బ్యాక్టీరియా కూడా ఉత్పత్తి అవుతుంది. అయితే కాటన్ ప్యాడ్లను ఉపయోగించడం వల్ల ఇలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే వీటిని మళ్లే వాష్ చేయొచ్చు. దీనితో బ్యాక్టీరియా వదిలిపోతుంది. వీటిలో బ్యాక్టీరియా నిల్వ ఉండే అవకాశం చాలా తక్కువ. 
 

click me!