Ambani women
అంబానీ ఫ్యామిలీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యంత సంపన్నుడుగా ముకేష్ అంబానీ అందరికీ సుపరిచితమే. రీసెంట్ గా తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా జరిపారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ సెలబ్రెటీలు అందరూ వచ్చి సందడి చేశారు.
అంతేకాదు.. ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన చీర, జ్యూవెలరీ, ఇషా అంబానీ లెహంగా కూడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. తాజాగా.. ఈ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది. అంబానీ కుటుంబంలో ఉన్న మహిళలు అందరి చేతికి నల్లదారం ఉంది.
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు కోటి రూపాయల విలువైన దుస్తులు, నగలు ధరించారు. అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు ధరించే ఆభరణాలపైనే అందరి దృష్టి పడింది. కానీ చేతికి కట్టిన నల్లటి దారాన్ని చాలా తక్కువ మంది దృష్టి పెట్టారు.
నీతా అంబానీ కొత్త కోడలు రాధిక కూడా నల్ల దారం ధరించింది. అయితే అంబానీ కుటుంబ మహిళలు తమ చేతులకు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
నల్ల దారాన్ని ధరించడం వల్ల నిశ్చయమైన విజయాలు లభిస్తాయని, చెడు కన్ను నుండి మనలను కాపాడుతుందని చెబుతారు. అంతే కాదు, నల్ల దారం వ్యాధులను దూరం చేస్తుందని చెబుతారు. ఇలా అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతికి నల్ల దారం కట్టుకుంటారని వినికిడి.
నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ సంప్రదాయ, పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు కూడా నల్ల దారం ధరించారు. కుటుంబంలోని పెద్ద కోడలు శ్లోకా మెహతా కూడా సంప్రదాయాలు , ఆచారాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె చేతికి కూడా ఎప్పుడూ నల్లదారం ఉండటం విశేషం.