లిప్ స్టిక్ వాడకున్నా పెదాలు ఎర్రగా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Mar 19, 2024, 3:50 PM IST

ఆడవాళ్లకు లిప్ స్టిక్ అంటే పిచ్చి. చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజూ లిప్ స్టిక్ ను వాడుతుంటారు. కానీ వీటిలో ఉండే కెమికల్స్ పెదాల చర్మాన్నిదెబ్బతీస్తాయి. ఇవి ఎన్నో వ్యాధులకు కూడా కారణమవుతాయి. మీ పెదాలు ఎర్రగా ఉండాలంటే లిప్ స్టిక్ నే వాడాల్సిన అవసరం లేదు. 

ఆడవాళ్లందరి పెదాలు ఎర్రగా ఉండవు. కొందరి పెదవులు ఎర్రగా ఉంటే.. మరికొందరి పెదవులు నల్లగా ఉంటాయి. నల్లని పెదాలున్న వారు ఎర్రని లిప్ స్టిక్ ను బాగా వాడుతుంటారు. దీనివల్ల అందంగా కనిపించినా మీ ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. అవును లిప్ స్టిక్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్నిదెబ్బతీస్తాయి. అందుకే లిప్ స్టిక్ ను వాడకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే నల్లని పెదాలున్న వారు కొన్ని సింపుల్ టిప్స్ తో పెదాలను ఎర్రగా మార్చొచ్చు. అదెలాగో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పెదాలు నల్లగా ఎందుకుంటాయి? 

పెదవులు నల్లగా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో పెదవులు పొడిబారడం, సూర్యరశ్మికి గురికావడం, పెదవులపై మృతకణాలు పేరుకుపోవడం, విటమిన్ల లోపం, తేమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల పెదవులు నల్లగా ఉంటాయి. 
 

Latest Videos


లిప్ స్టిక్ దుష్ప్రభావం 

ఆడవాళ్లు తమ పెదవులు ఎర్రగా మారేందుకు షాపుల్లో కొనే కాస్మొటిక్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులోనూ చాలా రకాల లిప్ స్టిక్ లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి కొంతమందికి ఎలాంటి దుష్ప్రభావాలను చూపవు. కానీ మరికొంతమందికి మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ను చూపిస్తాయి. దీనివల్ల కొందరి పెదవులు నల్లగా మారడం వంటి సమస్యలు వస్తాయి. 

హోం రెమెడీస్

పెదవులు ఎర్రగా మారడటానికి మీరు లిప్ స్టిక్ నే వాడాల్సిన అవసరం లేదు. కెమికల్స్ ఉండే లిప్ స్టిక్ ఎన్నో సమస్యలకు కూడా కారణమవుతాయి. అందుకే వీటిని వాడకూడదు. కానీ మన ఇంట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ తో పెదాలను ఎర్రగా, అందంగా మార్చుకోవచ్చు. అదెలాగంటే?

Beauty

బాదం

బాదం పౌడర్, మిల్క్ క్రీమ్ రెండింటినీ బాగా మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయడం వల్ల నల్లని పెదాలు ఎర్రగా మారుతాయి. బాదం పలుకుల్లోని విటమిన్ ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదాలను తేమగా ఉంచి పెదవులు నల్లగా మారకుండా చేస్తాయి. 
 

దానిమ్మ

దానిమ్మలో ఎన్నో పోషకాలుంటాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది పెదవులను ఎర్రగా మార్చడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం దానిమ్మ గింజలను మెత్తగా గ్రైండ్ చేసి రోజ్ వాటర్ తో కలపండి. దీనిని పెదాలకు అప్లై చేయండి. ఇలా రోజూ లేదా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు ఎర్రగా మారతాయి.
 

అలోవెరా జెల్

కలబందలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదవులను సంరక్షించడానికి బాగా సహాయపడతాయి. మన పెదవులు తేమగా ఉన్నప్పుడు అవి పొడిబారకుండా ఉంటాయి. కాబట్టి అలోవెరా జెల్ తో పాటు పసుపును అప్లై చేయండి. కలబందలోని తేమ గుణాలు పెదవులు పొడిబారకుండా, ఎర్రగా ఉండటానికి బాగా సహాయపడతాయి. 

click me!