ఆడవాళ్లు గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | May 18, 2024, 10:43 AM IST

పాలు, పంచదార కలిపిన టీ కంటే గ్రీన్ టీనే ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలిసింది. ఈ గ్రీన్ టీ బరువును తగ్గించడమే కాకుండా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికంటూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గ్రీన్ టీని ఆడవారు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
 

ప్రాస్తుత కాలంలో చాలా మంది ఆడవారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే సంతానోత్పత్తిని పెంచుకోవడానికి గ్రీన్ టీ తాగాలా? అనే సందేహం చాలా మంది ఆడవారికి కలుగుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కెఫిన్ ను తగ్గించి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని తాగడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. మరి ఆడవారు గ్రీన్ టీని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్ టీ తాగాలి?

గర్భిణిలు, ఆడవారు తమ సంతానోత్పత్తిని పెంచడానికి రోజూ 200 మి.గ్రా కంటే తక్కువ గ్రీన్ టీ , కెఫిన్ ను తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంటే మీరు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగొచ్చు. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ రిస్క్ ను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే ఆడవాళ్లు తమ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి హెర్బల్ టీలను కూడా తాగొచ్చు. 
 

Latest Videos


ఆక్సీకరణ లక్షణం

గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని అవయవాలను సెల్యులార్ దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి. దీనివల్ల సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 
 

విటమిన్ సి

గ్రీన్ టీలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటుగా  ఆక్సీకరణ ఒత్తిడి వల్ల శరీరంలోని కణాలు దెబ్బతినకుండా నిరోధించడానికి కూడా సహాయపడుతుంది. 
 

Image: Freepik

ఖనిజాలు

గ్రీన్ టీ ఆకుల్లో మన శరీరానికి అవసరమైన జింక్, మాంగనీస్, క్రోమియం, సెలెనమ్ వంటి ముఖ్యమైన ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మహిళల శరీరంలో అండోత్సర్గమును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతాయి.

జీవక్రియ

రోజూ గ్రీన్ టీని తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో మెటబాలిజంను పెంచుతాయి. ఇది గర్భధారణ సంబంధిత మూడ్ స్వింగ్స్ ను తగ్గించడానికి ఆడవాళ్లకు సహాయపడుతుంది. 

జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది

చాలా మంది గర్భిణిలకు ఈ సమయంలో వాంతులు అవడం, వికారంగా అనిపించడంతో పాటుగా, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే వీళ్లు గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు   తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

green tea

ఎముకల బలం

గ్రీన్ టీలో ఉండే పోషకాలు మహిళల్లో ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది హార్మోన్ల హెచ్చుతగ్గుల సమస్యలను కూడా తగ్గిస్తుంది. గ్రీన్ టీని తాగితే ఎమకల సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

green tea

గ్రీన్ టీ దుష్ప్రభావాలు 

రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని రక్త కణాలు ఇనుము శోషణను తగ్గిస్తాయి. ప్రగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా గ్రీన్ టీ తాగితే రక్తహీనతకు దారితీస్తుంది. పిండంలో న్యూరోలాజికల్ డిజార్డర్స్ నివారించడానికి ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎక్కువగా గ్రీన్ టీ తాగితే వారి శరీరంలో ఈ ఫోలిక్ యాసిడ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
 

click me!