మెంతి గింజల పేస్ట్‌లో కలబంద జెల్ లేదా రోజ్ వాటర్ జోడించండి. ఈ పేస్ట్ పూర్తిగా సిద్ధమైన తర్వాత, దానిని 5 నిమిషాలు పక్కన ఉంచాలి . 5 నిమిషాల తర్వాత పేస్ట్‌ను మీ ముఖంపై కనీసం 10 నుండి 15 నిమిషాలు అప్లై చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై అప్లై చేసేటప్పుడు మీ కళ్ళను రక్షించుకోవాలని గుర్తుంచుకోండి. పేస్ట్‌ను అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత, మీరు మీ ముఖాన్ని పచ్చి పాలతో మసాజ్ చేయవచ్చు.
తేలికగా మసాజ్ చేసిన తర్వాత, మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోండి . తరువాత టవల్ తో తుడుచుకోవాలి. ఆ తర్వాత, మీరు మీ ముఖంపై జెల్ లేదా మాయిశ్చరైజర్‌ను అప్లై చేయవచ్చు. మెంతి గింజలతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. దీని నుండి మీరు మీ ముఖం స్మూత్ గా మెరుస్తూ కనపడుతుంది.