ఫిట్నెస్, సంప్రదాయ సమ్మేళనం
తనైరా శారీ రన్‌ను జెజె యాక్టివ్ కోచ్ ప్రమోద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక జీవనశైలిలో కూడా సంప్రదాయ వస్త్రధారణను ఎలా చొప్పించుకోవచ్చు అనే సందేశాన్ని స్ఫురింపజేశారు. చీర కేవలం ఒక వస్త్రం కాదు, అది బలం, వ్యక్తిత్వం, స్ఫూర్తి కి (ప్రతీక). మహిళలను ఆరోగ్యాన్ని ప్రాధాన్యతనివ్వమని ప్రోత్సహించడంతో పాటు, వారు ఎదుర్కొనే సాంఘిక అడ్డంకులను అధిగమించేలా ప్రేరేపించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
మహిళల కోసం ఓ శక్తివంతమైన వేదిక
ఈ కార్యక్రమం గురించి తనైరా సీఈఓ అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ, “తనైరా శారీ రన్ మహిళల బలం, సంప్రదాయం, ఆధునికత మధ్య ఉన్న అందమైన అనుసంధానాన్ని చూపిస్తుంది. మహిళలు తమ వారసత్వాన్ని గర్వంగా ధరిస్తూనే, ఆరోగ్యాన్ని కూడా సమానంగా ప్రాధాన్యతనివ్వాలి. చీర నేటి ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఎలా సరిపోతుందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడిస్తున్నాము” అని తెలిపారు.