మనకు మార్కెట్ లో ఎన్నో రకాల నూనెలు దొరుకుతాయి. కానీ వీటిలో చాలా మంది వాడేది కొబ్బరి నూనెనే. ఇప్పటి నుంచి కాదు.. ఎన్నో ఏండ్ల నుంచి కొబ్బరి నూనెను వాడుతూ వస్తున్నారు. ఎందుకంటే దీనిలో అన్ని ప్రయోజనాలు దాగున్నాయి కాబట్టి. కొబ్బరి నూనెను జుట్టుకు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అలాగే మంచి స్మూత్ గా, షైనీగా కూడా ఉంటుంది. అంతేకాదు వెంట్రుకలు హైడ్రేట్ గా, హెల్తీగా ఉంటాయి. అందుకే చాలా మంది కొబ్బరి నూనెనే జుట్టుకు ఎక్కువగా వాడుతారు. అయితే ఇది కేవలం మన జుట్టుకు మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
నిపుణుల ప్రకారం.. కొబ్బరి నూనె మన చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. అలాగే ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ముఖానికి కొబ్బరి నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.