మందార పొడిని ఇలా వాడితే.. మీ జుట్టు నల్లగా ఉంటుంది.. ముఖం అందంగా మెరిసిపోతుంది

Published : Jan 31, 2025, 10:26 AM IST

మందారం పూల పొడిని కేవలం ఒక జుట్టుకు మాత్రమే కాదు.. ముఖానికి కూడా ఉపయోగించొచ్చు. దీనితో చేసిన పేస్ట్ ను పడితే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అలాగే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. 

PREV
18
మందార పొడిని ఇలా వాడితే..  మీ జుట్టు నల్లగా ఉంటుంది.. ముఖం అందంగా మెరిసిపోతుంది
hibiscus

మందార పువ్వులు మన జుట్టుకు, చర్మానికి రెండింటీని ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండిన మందార పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ అందాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మందార పొడిలో ఉండే సహజ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. చనిపోయిన చర్మ కణానలను తొలగించి స్కిన్ కలర్ ను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. 

28

మందార పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. దీంతో చర్మంపై ఉండే ముడతలు, గీతలు తగ్గిపోతాయి. అలాగే చర్మం తేమగా ఉంటుంది. ఇందుకు సహాయపడే మాయిశ్చరైజింగ్ లక్షణాలు మందార పొడిలో పుష్కలంగా ఉంటాయి. మందార పొడిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. అలాగు హైపర్పిగ్మెంటేషన్ తగ్గుతుంది. 

ఇకపోతే మందార పొడిని జుట్టుకు ఉపయోగించడం వల్ల నెత్తిమీద రక్త ప్రసరణ పెరిగి జుట్టు పొడుగ్గా పెరుగుతుందని నమ్ముతారు. మందార పొడిలో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్లు జుట్టు కుదుళ్లను బలంగా చేయడానికి సహాయపడతాయి.

అలాగే జుట్టు తెగిపోకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది. మందార పొడి నేచురల్ కండీషనర్ గా పనిచేసి జుట్టుకు మంచి షైన్ ను, సాఫ్ట్ నెస్ ను ఇస్తుంది. దీనిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి. డ్రై నెస్ ను తగ్గించడానికి సహాయపడతాయి. 

38
hibiscus

చర్మానికి మందార పొడి ప్రయోజనాలు

మందార పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఆంథోసైనిన్లు  ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి బాగా సహాయపడతాయి. దీంతో ముఖంపై ఉన్న ముడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. మందార పొడిలో ఉండే నేచురల్ ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. అలాగే చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. దీంతో మీ చర్మం సాఫ్ట్ గా, మంచి రంగులోకి వస్తుంది. 

 

48
hibiscus

మందార పొడి చర్మ ఛాయను సమం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది హైపర్పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని నేచురల్ గా కాంతివంతంగా చేస్తుంది. మందార పొడిలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని పొడిబారకుండా చేసి తేమగా ఉంచడానికి సహాయపడతాయి. మందారం పొడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయడతాయి. 

58
hibiscus

జుట్టుకు మందార పొడి ప్రయోజనాలు

జుట్టు పెరుగుతుంది

మందార పొడిని ఉపయోగిస్తే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. ఎలా అంటే ఈ పొడి నెత్తిమీద రక్తప్రసరణను పెంచి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. దీంతో మీ జుట్టు బాగా పొడుగ్గా పెరుగుతుంది. 

జుట్టును బలంగా చేస్తుంది

మందార పొడిలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా చేయడానికి, జుట్టు తెగిపోకుండా, వెంట్రుకలు విచ్చిన్నం కాకుండా ఉండానికి సహాయపడతాయి. అలాగే మందార పొడి ఒక నేచురల్ కండీషనర్ గా  కూడా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల మీ జుట్టు మృదువుగా అవుతుంది. అలాగే జుట్టు మంచి షైనీగా అవుతుంది. 

మందార పొడిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే చుండ్రు,నెత్తి పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మందార పొడి నెత్తి తెల్లబడకుండా నల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును హెల్తీగా ఉంచుతుంది. 

68
hibiscus


చర్మానికి మందార పొడిని ఎలా ఉపయోగించాలి? 

ఒక టీస్పూన్ మందారం పొడిని తీసుకుని అందులో  1 టేబుల్ స్పూన్ పెరుగు, తేనె, కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖానికి పెట్టి 15-20 నిముషాలు అలాగే వదిలేయండి. దీన్ని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయండి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్, మంచి ప్రకాశవంతం చేస్తుంది.

ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ ఎలా చేయాలి?

ఒక టీస్పూన్ మందారం పొడిని తీసుకుని అందులో  ఒక టేబుల్ స్పూన్ పంచదార,  1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి కలపండి. దీన్ని ముఖానికి పెట్టి వృత్తాకార కదలికలలో సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత కడిగేయండి. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. 
 

78

మెరిసే ముఖం కోసం ఫేస్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ మందారం పొడిని తీసుకుని అందులో  టేబుల్ స్పూన్ మినపపప్పు పిండి, తగినన్ని పాలు పోసి చిక్కటి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ స్కిన్ టోన్ ను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. 
 

88

జుట్టు కోసం మందారం హెయిర్ మాస్క్ ను ఎలా చేయాలి?

2 టీస్పూన్ల మందారం పొడిలో  2 టీస్పూన్ల కొబ్బరి నూనె, టీస్పూన్ పెరుగు వేసి పేస్ట్ లా చేయండి. ఈ మాస్క్ ను మీ నెత్తికి, జుట్టుకు బాగా అప్లై చేయండి. 30-45 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయండి. ఈ మాస్క్ జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. అలాగే జుట్టును బలంగా చేస్తుంది. 

మందార కండీషనర్ ను ఎలా చేయాలి? 

ఒక టీ స్పూన్ మందార పొడిలో  కప్పు అలోవెరా,కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను వేసి బాగా కలపండి. దీన్ని షాంపూతో తలస్నానం చేయడానికి 10-15 నిమిషాల ముందు పెట్టండి. ఈ కండీషనర్ మీ జుట్టుకు షైన్, స్మూత్ నెస్ ను ఇస్తుంది. 

click me!

Recommended Stories