యోని దుర్వాసనను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు

First Published Nov 15, 2023, 1:48 PM IST

చాలా మందికి యోని నుంచి దుర్వాసన వస్తుంటుంంది. యోని పీహెచ్ స్థాయిల అసమతుల్యత, అంటువ్యాధులు లేదా ఇతర అంతర్లీన అనారోగ్య సమస్యల వల్ల ఇలా వాసన వస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో దీనిని తగ్గించుకోవచ్చు. 

యోని పరిశుభ్రతను పాటిస్తున్నా.. చాలా మంది యోని దుర్వాసన సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే దీన్ని తగ్గించుకోవడానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ను కూడా వాడుతుంటాయి. అయినా వాసన మాత్రం పోదు. నిజానికి యోని ఇలా దుర్వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 
 

యోని వాసన అంటే ఏమిటి?

యోని వాసన అంటే యోని ప్రాంతం నుంచి ఉద్భవించే ఏదైనా వాసన. ఇది పీహెచ్ స్థాయిల అసమతుల్యత, అంటువ్యాధులు లేదా కొన్ని అంతర్గత అనారోగ్య సమస్యల వల్ల కూడా వస్తుంది. యోని వాసన చాలా కాలంగా వస్తుంటే తప్పకుండా హాస్పటల్ కు వెళ్లాలి. దీనితో పాటుగా అసాధారణ ఉత్సర్గ, దురద, మంట,  మూత్రవిసర్జనలో మంట, లైంగిక కార్యకలాపాల్లో  నొప్పి వంటి ఇతర సమస్యలు కూడా రావొచ్చు. 
 

యోని వాసనకు కారణమేంటి?

పీరియడ్స్, సెక్స్ కూడా భిన్నమైన వాసనను కలిగిస్తాయి.  బాక్టీరియల్ వాగినోసిస్ లేదా ట్రైకోమోనియాసిస్ వంటి అంటువ్యాధులు, యోని పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం లేదా టాంపోన్లు వంటి ఇతర కారకాల వల్ల యోని నుంచి దుర్వాసన వాసన వస్తుంది. హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల మందులు కూడా యోని వాసనను ప్రభావితం చేస్తాయి. మరి యోని దుర్వాసనను తగ్గించుకోవడానికి ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
 

vagina

పరిశుభ్రత పద్ధతులు 

యోని ప్రాంతంలో చెమట పడుతుంది. అలాగే అక్కడ దుమ్ము కణాలు కూడా సులవుగా పేరుకుపోతాయి. అలాగే చనిపోయిన చర్మ కణాలు కూడా అక్కడే పేరుకుపోతాయి. అయితే ఇవన్నీ మీ యోని వాసనను ప్రభావితం చేస్తాయి. అందుకే దానిని శుభ్రంగా ఉంచాలి. రెగ్యులర్ స్నానం చేయాలి. లేదా ప్రైవేట్ భాగాలను రోజు క్లీన్ చేసుకోవాలి. అలా అని యోని లోపల కడగకూడదు.
 

కాటన్ లోదుస్తులు 

మీరు ధరించిన లోదుస్తులు శరీరానికి గాలిని తగలనియ్యకపోతే మీ వల్వా ప్రాంతం చుట్టూ ఎన్నో సూక్ష్మక్రీములు పేరుకుపోతాయి. అందుకే బ్రీతబుల్ లోదుస్తులను ఎంచుకోండి. కాగా రాత్రిపూట లోదుస్తులను ధరించాల్సిన అవసరం కూడా లేదు. 

డౌచింగ్ వద్దు 

డౌచింగ్ అంటే యోని లోపలి భాగాన్ని నీరు లేదా ఇతర ద్రవాలతో కడగడం. కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇది సహజ పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.  అలాగే ఇది సహజ బ్యాక్టీరియా పెరుగుదలను కూడా పెంచుతుంది. డౌచింగ్ వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ వాగినోసిస్ వంటి సమస్యలు వస్తాయి. 
 

ప్రోబయోటిక్స్ ఫుడ్ 

పెరుగు లేదా పులియబెట్టిన ఆహారాలు యోని ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మీ యోని నుంచి మంచి వాసన వచ్చేలా చేస్తాయి. వీటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల మీ యోనిలోని బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుతుంది. ఇది యోని మంచి వాసనకు సహాయపడటమే కాకుండా అంటువ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

సురక్షితమైన సెక్స్ 

సురక్షితమైన సెక్స్ యోని నుంచి దుర్వాసన రావడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కండోమ్ ధరించడం వల్ల లైంగిక సంక్రమణ వ్యాధులు, లైంగిక సంక్రమణ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు. ఇవి తరచుగా యోని బ్యాక్టీరియా సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. అలాగే యోని నుంచి చెడు వాసన వచ్చేలా చేస్తాయి. 

click me!