Skin Care: ఎండ వేడి నుంచి చర్మాన్ని ఎలా కాపాడాలి?

Published : Mar 17, 2025, 03:49 PM IST

కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల సూర్యరశ్మి వల్ల చర్మం పాడవకుండా కాపాడుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చు.  

PREV
15
Skin Care: ఎండ వేడి నుంచి చర్మాన్ని ఎలా కాపాడాలి?
these foods helps to glow your skin in summer

ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల చర్మం తొందరగా ముడతలు పడుతుంది. సన్‌స్క్రీన్ వాడితే కొంతవరకు ఈ సమస్యను తగ్గించవచ్చు. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల సూర్యరశ్మి వల్ల చర్మం పాడవకుండా కాపాడుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చు.
 

25
these foods helps to glow your skin in summer

ఎండాకాలంలో రెగ్యులర్ గా ఆకు కూరలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా  పాలకూర తీసుకోవాలి. ఇవి ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా అందాన్ని పెంచడంలోనూ సహాయం చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మంచిది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముడతలు రాకుండా చేస్తుంది.

35
these foods helps to glow your skin in summer

సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని కాపాడుతుంది. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. అందుకే ఎండాకాలంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే చాలా రకాల పండ్లను రెగ్యులర్ గా తీసుకోవాలి. పుచ్చకాయ, నిమ్మకాయ నీరు లాంటివి తీసుకుంటే చాలు.

గ్రీన్ టీ తాగడం వల్ల చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని కాపాడుతుంది. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.

45
tomato

టొమాటోలో లైసోపీన్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాపాడుతుంది. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. చర్మానికి నిగారింపునిస్తుంది. మీరు టమాట తినడమే కాదు.. అప్పుడప్పుడు.. ముఖానికి టమాట గుజ్జు రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల  ముఖం యవ్వనంగా మారుతుంది.

55


నట్స్, సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడుతాయి. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం ముడతలు పడకుండా చేస్తాయి.

click me!

Recommended Stories