చెవులకు బంగారు బుట్టలు ధరించింది. మెడలో జ్యూవెలరీ కూడా పాత మోడల్సే. ఇవి.. శోభితా వాళ్ల అమ్మ, అమ్మమ్మ జ్యూవెలరీ కావడం విశేషం. ఈ కాలం అమ్మాయిలు.. ప్రతి ఫంక్షన్ కీ ట్రెండీగా ఉండేవి ధరించాలని అనుకుంటారు. కానీ.. శోభితా తన అమ్మమ్మ ల కాలం నాటి జ్యూవెలరీ ధరించి ట్రెండ్ సెట్ చేసింది. తన ఎంగేజ్మెంట్ రోజున కూడా.. అందరికంటే భిన్నంగా, సంపిల్ గా కనిపించి.. అందరి చేత వావ్ అనిపించుకుంది. మరి.. పెళ్లిలో ఇంకెంత అందంగా మెరుస్తుందో చూడాలి. పెళ్లికి కూడా కంచిపట్టు చీర కట్టుకుంటుందని, నాగచైతన్య పంచ కట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.